బీజేపి –టీడీపీ వైరం..వైసీపికి కలిసిరానుందా

పిల్లి , ఎలుకా తగువు కోతి తీర్చింది అనే కధ అందరికీ గుర్తుఉండే ఉంటుంది.ఇప్పుడు ఏపీ లో కూడా అదే పరిస్థితి.

 Tdp,congress Leaders Jump Into Ysrcp..?-TeluguStop.com

టిడిపికి బీజేపి కి మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు వైసీపికి కలిసోచ్చేలా ఉంది.కేంద్రంతో టిడిపి తెగతెంపులు చేసుకుంటోంది అనే వార్తలు వస్తున్నప్పటి నుంచీ.

టిడిపి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మరియు , వైసీపి నుంచీ టిడిపిలోకి జంప్ అయిన నాయకులలో టెన్షన్ మొదలయ్యింది… ఒక‌ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నన్ జరగడం అనేది అసంభవం అని తేలిన నేపధ్యంలో.పార్టీలో కొత్త‌గా చేరిన వారితో పాటు టీడీపీలోకి వెళ్లాల‌నుకునే వారు కూడా.

ఇప్పుడు వైసీపి గూటికి వెళ్ళాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

విభజనలో నియోజక వరగాల పునర్విభజన జరగడం లేదనే టెన్షన్ ఇరు పార్టీల సీఎం లలో నెలకొంది.

అయితే తెలంగాణలో కేసీఆర్ పరస్థితి మెరుగ్గానే ఉన్నా సరే.ఏపీలో మాత్రం ప‌రిస్థితి టిడిపికి అనుకూలంగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్‌లో బ‌ల‌మైన నేత‌లు కొంద‌రు.టిడిపికి వెళ్ళాలని భావిస్తున్నట్టుగా తెలుస్తున్నా సరే అది ఒకప్పటి విషయమని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని అంటున్నారు.నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నఆశలో చంద్రబాబు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలని వైసీపి నుంచీ టిడిపి సైకిల్ ఎక్కించారు.అయితే ఇప్పుడు చంద్రబాబు వారందరికీ సర్ది చెప్పుకోలేక పోతున్నారు అని తెలుస్తోంది.

ఇదిలాఉంటే పునర్విభజన జరుగుతుందని భావించిన కొండ్రు మురళి , మానుగుంట, డీఎల్ ,వంటి కాంగీ నేతలు టిడిపిలోకి వెళ్ళాలని భావించారు.అయితే ఇప్పుడు పునర్విభజన అంశం లేకపోవడంతో ఈ నేతలు అందరు ఇప్పుడు వైసీపి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇదే సమయంలో కొందరు టిడిపి నేతలు కూడా వైసీపిలోకి వస్తారు అనే ప్రచారం జరుగుతోంది.

అయితే కొన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు పార్టీ పరంగా సక్రమంగా పనిచేయడం లేదని ఇప్పటికే సర్వేల్లో వెల్లడైంది.

మూడున్నరేళ్లు నియోజకవర్గంలో అందుబాటులో ఉండకుండా, జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత నియోజకవర్గానికి చేరుకున్న వారు కూడా లేకపోలేదు…ఈ తరుణంలో వీరిపై సర్వే చేసి సర్వే లో వచ్చే నివేదిక ఆధారంగా కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి వైసీపి వర్గాలు.అయితే బిజెపి కావాలనే పునర్విభజన అంశాన్ని బయటకి తేలేదని జగన్ కి మేలు చేయడం కోసమే బీజేపి ఇలా చేసి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube