టీడీపీ ఎంపీలు సైలెంట్ వెనుక.. “రాజ్ నాధ్ సింగ్” స్కెచ్

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేసపెట్టిన తరువాత మొదటి నాలుగు రోజలు టిడిపి ఎంపీలు రెండు సభలలో ఎలాంటి నిరసనలు తెలిపారో అందరికీ తెలిసిందే.ఒక రకంగా బిజెపి పరువు ఏపీ వ్యాప్తంగా తుడిచిపెట్టుకు పోయింది.

 Why Tdp Mp’s Silent On Pm Speech Reason Is…-TeluguStop.com

అయితే చివరి రెండు రోజులు మాత్రం ఎంపీలు సైలెంట్ అయ్యారు.ముఖ్యంగా ప్రధాని ప్రసంగ సమయంలో అడ్డు పడదాం అనుకున్న వారు చప్పుడు చేయలేదు.

అయితే అలా ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఎవరికీ అంతుబట్టలేదు.అయితే ఈ విషయం గురించి ఓ ఆసక్తికరమైన విషయం రాజకీయ వర్గాల్లో చర్చల్లో నిలుస్తోంది.

అదేంటంటే.

సుమారు నాలుగు రోజుల పాటు ఏపీ హక్కుల సభలో ఆందోళనలో పాల్గొన్న టిడిపి ఎంపీలు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో భేటీ అయ్యారట…ఆ భేటీ తరువాతే అందరు సైలెంట్ అయ్యారు అయితే ఆ సైలెంట్ వెనుకాల ఉన్న రీజన్ ఏమిటంటే.

ఎంపిల్లో పలువురిపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్టులను హోంశాఖమంత్రి తనను కలసిన ఎంపిల ముందు పెట్టి వీటిపై ఎం చేద్దాం అని అడిగారట.దాంతో ఏమి చేయాలి తెలియక నీళ్ళు నమిల సదరు ఎంపీలు…అయితే రాష్ట్రంలోని వివిధ పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చింది…పోలవరం ,రాజధాని కోసం ఇలా అనేక నిధులు ఇచ్చింది అయితే వీటిలో అక్రమాలు అవినీతి జరిగింది అనేది కేంద్రం ముందు నుంచీ వాదిస్తోంది.

జనసేన అధినేత, వైసీపి అధినేతలు కూడా పోలవరం విషయంలో ఆరోపణలు కూడా చేశారు.

అయితే ఇప్పుడు అదే కోణంలో కొన్ని ఫైళ్లని హోంమంత్రి “రాజ్ నాధ్” సింగ్ ఎంపీల ముందు ఉంచారట.

అందులో కేంద్రం నిధులు పక్కదారి ఎలా పట్టాయి.ఎలా దుర్వినియోగం అయ్యాయి.

అవినీతి ఎ స్థాయిలో జరిగింది ఇలాంటి అంశాలు ఉన్నాయని.ఎవరి జోబులోకి ఎంత ఎంత వెళ్ళింది అనే విషయాలు వివరంగా ఉన్నాయట.

ఫైళ్ళను చూసిన తర్వాత సదరు ఎంపిలు సైలెంట్ అయ్యారని టాక్….అందుకే అప్పటి నుంచీ ఎంపిల జోరు తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube