అక్టోబర్ నెలలో పుట్టారా.... అయితే మీ గురించి నమ్మలేని కొన్ని నిజాలు

అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు.అలాగే చాలా హుందాతనముతో ఆకర్షణీయంగాను, అందముగాను ఉంటారు.

 October Born People Astrology And Personality-TeluguStop.com

వీరు ఎవరితోనైనా స్నేహం చేసేస్తారు.

ఎవరితో కలవని వారిని కూడా యిట్టె కలిపేసుకుంటారు.

వీరు ఏదైనా పని చేయాలని అనుకుంటే ఆ పని అయ్యే వరకు నిద్రపోరు.అలాగే పక్కన వారిని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటారు.

వీరిలో లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది.వీరు చాలా శక్తి పరులు, ధైర్య వంతులు.

వీరికి కళల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండుట వలన కళల యందు ఎక్కువగా రాణింపు ఉంటుంది.వీరిలో దైవ భక్తి కూడా ఎక్కువే.

ఏదైనా పని ప్రారంభించాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా దైవానికి మొక్కుకొని మరీ ప్రారంభిస్తారు.


వీరు క్రమశిక్షణతో ఉండటమే కాకుండా పక్కవారు కూడా అలానే ఉండాలని అనుకుంటారు.వీరు ఏ పనైనా శక్తి యుక్తులతో సాధించుకుంటారు.ఏదైనా పని చేసినప్పుడు ఫలితం ఉంటేనే ముందడగు వేస్తారు.

వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వారిని మార్చటం ఎవరి వల్ల అవదు.

అయితే వీరు స్వయంకృషినే నమ్ముకుంటారు.

ఇతరుల విషయములో వీరు చాలా బాలన్స్ గా మాట్లాడతారు.వీరికి అవకాశము ఉన్నంత వరకూ మేలు చేయటానికే ప్రయత్నం చేస్తారు.

సున్నితమైన మనసు ఉండుటచేత వీరికి మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుంది.పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సర్డుకుపోతారే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తారు.

ఆరోగ్యము : వీరికి ఆరోగ్యం నార్మల్ గానే ఉంటుంది.చర్మ సంబంధిత వ్యాధులు, షుగర్ వ్యాధి వచ్చే అవకాశము ఉంది.
ధనము : శ్రమించి, తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు మరియు అనుభవిస్తారు.లక్కీ వారములు : సోమవారము, గురువారము, శుక్రవారము.
లక్కీ కలర్: బ్లూ కలర్, రోజ్ కలర్.
లక్కీ స్టోన్: ముత్యం, ఓపల్ స్టోన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube