కేసీఆర్ పక్కా ప్లాన్ ఇదే ..అందుకే పవన్ కి అనుమతులు

పవన్ కళ్యాణ్ తనవల్ల ప్రజలకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ రెండు తెలుగురష్ట్రాలలో ఉండే అధికార పార్టీలకి మాత్రం ఎటువంటి భయం లేదు ఎందుకంటే ప్రజలని అడ్డం పెట్టుకుని అభిమానాన్ని ప్రభుత్వాలకి అమ్మేసుకుంటున్నాడు అంటూ ఇప్పటికే అనేకమంది ఆది పోసుకుంటున్నారు.ఒక పక్క ఇద్దరు సీఎం లు బాగా పని చేస్తున్నారు అని చెప్పే పవన్ మరి పార్టీ ఎందుకు పెట్టవలసి వచ్చిందో అర్థం కావడం లేదు.

 Kcr Master Plan In Telangana-TeluguStop.com

తను మాట్లాడే మాటలకి తలా తోకా రెండు ఉండవు అసలే పవన్ పెద్ద కన్ఫ్యూజ్ మాస్టర్ అనుకుంటే దానికి తోడు తోకలా జనసేన పార్టీ కూడానా అంటూ పవన్ పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.

ఇదిలా ఉంటే పవన్ విషయంలో కేసీఆర్ ఇంత సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటి.

ఒకానొక సమయంలో కేసీఆర్ ని పవన్ తిట్టకూడని బూతులు తిట్టినా ఏం పర్లేదు అన్నట్టుగా కేసీఆర్ తుడిచేసుకుంటున్నారు కారణం ఏమి అయి ఉంటుంది అంటే.దానికీ చాలా కారణాలు ఉన్నాయి.

అయితే మరీ పవన్ విమర్శించకపోతే ఎలా అంటూ ఓ ఏమ్మేల్సీతో అసలు పవన్ ఫుల్ టైం పొలిటికల్ లీడర్ కానేకాదు అంటూ ప్రతిపక్షాల నోళ్ళు మూసుకోవాలని ఓ మాట మాట్లాడారు.ఇదిలా ఉంటే.

అసలు పవన్ పర్యటనకి అనుమతులు ఇచ్చిన కేసీఆర్ కోదండరాం లాంటి ఉద్యమ నాయకుడు ,తెలంగాణా సాధనలో కేసీఆర్ తో సమానంగా ఉద్యమం చేసిన నాయకుడికి తెలంగాణలో తిరిగే అనుమతులు ఎందుకు ఇవ్వలేదు.అనే ప్రశ్న వేసుకుంటే

కోదండరాం ముందు కేసీఆర్ కి వ్యతిరేకి.

పవన్ కళ్యాణ్ తో కేసీఆర్ తో లాలూచి పడ్డాడు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తాను అని చెప్పాడు కాబట్టి…పవన కి అనుమతి వచ్చింది అంటూ ఈ వార్తని కాంగ్రెస్ ప్రజలలోకి తీసుకువేల్లిపోయింది.ఇదిలాఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పంచ్ డైలాగులతో ఎంతో కొంత పరువు పోగొట్టుకుంది టీఆర్ఎస్ అన్న మాట వాస్తవం.

ఈ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ శక్తి పున్జుకుంటే.టీఆర్ఎస్ కి చాలా నష్టం అందుకే పవన్ కి కేసీఆర్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నాడు.

భవిష్యత్తులో పవన్-కేసీఆర్ లు ఇద్దరు కలిసి ఎన్నికల్లో తిరుగుతారు అనేది ప్రస్తుత పరిణామాలని చుస్తే అర్థం అవుతోంది అంటున్నారు విశ్లేషకులు

ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కేసీఆర్ ల భేటీలో రైతులకు 24 గంటలు విద్యుత్‌ సరఫరాను మెచ్చుకుంటూ పవన్ ప్రకటన చేశారు.ఆ రోజు మొదలు పవన్ పై టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడా చిన్న కామెంట్ కూడా చేయలేదు.

అయితే ఇదే రోజున టీఆర్ఎస్ మంత్రులు కూడా కరీంనగర్ లో పర్యటన చేస్తున్నారు అయితే పవన్ పర్యటనపై ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు ఈ విషయాలని బట్టి చుస్తే పవన్ పర్యటనపై కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.అయితే ఒకానొక సమయంలో ఇద్దరు నేతలు ఒకరు మీద ఒకరు కామెంట్స్ చేసుకున్నారు.

అయినా సరే కేసీఆర్ పవన్ ల భంధం గమ్ము అటుకున్నట్టుగా ఉందని తెలుపుతున్నారు.మరి ఎందుకు పవన్ పై కేసీఆర్ మనసు పడేసుకున్నారు.

కాంగీ అన్నట్టుగానే నిజంగానే ఇద్దరి మధ్య రాజకీయ లాలూచి ఏమన్నా కుదిరిందా అని చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube