ప్రతి రోజు గుప్పెడు అవిసె గింజలను తింటే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు

మనలో చాలా మంది అవిసె గింజలతో తయారుచేసిన నూనెను వాడుతూ ఉంటారు.అయితే అవిసె నూనె కాకుండా అవిసె గింజలను డైరెక్ట్ గా తీసుకుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

 Flax Seeds Health Benefits, Telugu Health, Flax Seeds For Brain-TeluguStop.com

ప్రతి రోజు గుప్పెడు అవిసె గింజలను తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

అవిసె గింజలలో ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌,ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించి మలబద్దకం రాకుండా నిరోధిస్తుంది.ఈ గింజల్ని పొడి చేసి చపాతీ పిండి, దోశ‌ పిండి, ఇడ్లీ పిండిలో కలిపి తినవచ్చు.

చేప‌ల వంటి మాంసాహారం త‌రువాత ఆ యాసిడ్లు అధికంగా అవిసె గింజలలోనే ఉన్నాయి.కాబట్టి చేపలు తినలేని వారు అవిసె గింజల పొడి తింటే చాలా ప్రయోజనం కలుగుతుంది.


అవిసె గింజ‌లలో కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి.అంతేకాక ఈ గింజలు రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచటంలో సహాయపడతాయి.

వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే అలసట త‌గ్గుతుంది.శ‌రీరానికి నూతన శ‌క్తి వ‌స్తుంది.

రోజంతా ఉత్సాహంగా యాక్టివ్‌గా ప‌నిచేయ‌గ‌లుగుతారు.

మహిళల్లో హార్మోన్ల‌ను సమతుల్యం చేసే లక్షణాలు ఉన్నాయి.

అవిసె గింజల్లో యాంటీ ఏజింగ్ ల‌క్షణాలు సమృద్ధిగా ఉండుట వలన అందంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎసమృద్ధిగా ఉండుట వలన షుగ‌ర్‌, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించటంలో బాగా సహాయపడుతుంది.

అవిసె గింజ‌ల‌ను ప్రతి రోజూ తింటుంటే జుట్టు దృడంగా మారటమే కాకుండా చుండ్రు స‌మస్య కూడా ఉండ‌దు.

త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులు, న‌డుం నొప్పి స‌మ‌స్య‌ల‌కు అవిసె గింజ‌ల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.

అవిసె గింజలు మెదడుకు శక్తిని అందిస్తాయి.దాంతో మెదడు చురుకుగా మారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.అందువల్ల చిన్న పిల్లలకు అవిసె గింజల పొడిని ప్రతి రోజు తినిపిస్తే చదువులో రాణిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube