షాకింగ్ న్యూస్ వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణకి సీటు డౌటే

ఏపీలో తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి పై ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆయన ఎవరో కాదు తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి ఎన్టీరామారావు గారి తనయుడు తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ.

 Tdp Leader Shocking Commets On Balakrishna-TeluguStop.com

బాలకృష్ణకి ఈసారి టికెట్ ఇవ్వరని పెద్ద టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది…కానీ బాలకృష్ణ కి చంద్రబాబు టికెట్ ఇవ్వకుండా ఉంటారా.కానీ కానీ టీడీపీ నేత ఒకరు ఇదే విషయం చెప్పడంతో అందరు జుట్లు పీక్కున్నారు.

ఆయన అసలు ఏమి చెప్పారంటే .

కడప జిల్లా టీపీపీ నేత వీరశివారెడ్డి.కమలాపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు అయితే చంద్రబాబు ఎంత స్ట్రిక్ట్ అనే విషయాన్ని చెప్పడంలో బాలకృష్ణ ని జోడించారు.అందులో భాగంగానే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఆశించే వారిలో నేనూ ఉన్నా…గెలుపు గుర్రాలకే ఈ సారి ఎన్నికల్లో టికెట్లు ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు అన్నారు ఈ లెక్కలో చూస్తే గెలవడని భావిస్తే తన సొంత బావమరిది బాలకృష్ణకు కూడా చంద్రబాబు టికెట్‌ ఇవ్వరని కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి అన్నారు.

అంతేకాదు ప్రతిపక్ష నేత పై కూడా శివారెడ్డి ఫైర్ అయ్యారు.వైసిపి అధినేత జగన్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడం పగటికలేనన్నారు.కనీసం ఆయన పడుకున్నప్పుడు వచ్చే కలలో కూడా ఆయన సీఎం కాలేరు అంటూ ఎద్దేవా చేశారు.వైఎస్ లో ఉన్న విలువలు కనీసం కొంచం కూడా జగన్ లో లేవని అన్నారు.

సూటుకేసులు మోసేవారికి, బంధువులకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ పార్టీకి నిజమైన నేతలు కరువయ్యారని చెప్పారు.అయితే శివారెడ్డి తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కూడా కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారు అని ప్రజలు ఎవరు జగన్ ని నమ్మడానికి సిద్దంగా లేరని అన్నారు.

రానున్న ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్స్ ఇస్తారని ఎన్నికల్లో ఎవరు ఫిట్ ,అన్ ఫిట్ అనేది త్వరలో తేలుతుంది అని అన్నారు.

జగన్ మోకాళ్ళ యాత్ర చేసినా సరే గెలిచే వైసీపి అధికారంలోకి వచ్చే అవకాసం లేదని విమర్శించారు శివారెడ్డి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube