బిజేపీ గెలుపుతో బాబు డీలా కారణం ఇదేనట

గుజరాత్ ఫలితాలు బిజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపుతుంటే.ఏపీ సిఎం చంద్రబాబు లో మత్రం కంగారు పెంచుతున్నాయి.

 Modi Winning..ap Cm Tension Reason Is..-TeluguStop.com

ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశానికి నిరాశని మిగిల్చాయి.బిజెపి గెలుపు ప్రభావం మిగిలిన రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుంది అనేది వాస్తవం.

అయితే ఈ ప్రభావం ఏపిలో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశంపార్టీ-భాజపాల మధ్య పరిస్ధితిని మరింత బలపరిచేలా లేదు అనేది మాత్రం వాస్తవం.

అయితే ఇప్పుడు పోలవరం పై చంద్రబాబు ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

ఆ రకంగా ఒత్తిడి కూడా చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు అందుకే బాబు ని ముప్పు తిప్పలు పెడుతోంది కేంద్రం…వరుసాగా చుస్తే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనూ, ప్రత్యేకహోదా, విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్.ఇలా అనేక అంశాల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సహకరించకున్నా చంద్రబాబు గట్టిగా నిలదీయలేని స్ధితిలో ఉన్నారన్నది వాస్తవం.

అయితే ఈ విషయం లో బాబు ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే బహుశా ‘ఓటుకునోటు’ దెబ్బకు చంద్రబాబు మిన్నకుండి పోయారు అంటున్నారు.

దీనికి తగ్గట్టుగా.

దాదపు రెండేళ్ళుగా ప్రధానమంత్రి అపాయిట్మెంటే సాధించలేకున్నారంటేనే చంద్రబాబు పరిస్థితి ఎంతటి దీన స్థితిలో ఉందొ అర్ధం అవుతుంది అంటున్నారు.గుజరాత్ లో మోడీ ప్రభుత్వం ఓటమి పాలైతే కేంద్రం పై ఏపీ నుంచీ ఒత్తిడి పెంచవచ్చు అనుకున్నారు బాబు కానీ ఆ కల నెరవేరలేదు…తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ విజయాలతో మోడి మొహంలో విజయగర్వం స్పష్టంగా కనబడుతోంది.

మోడీ ని మాములుగానే పట్టుకోలేము ఇప్పుడు ఈ విజయ గర్వంతో ఉన్న మోడీ మరింతగా తన ప్రభావాన్ని బిజేపి అనుకూలంగా లేని రాష్ట్రాలమీద చూపించడం ఖాయం.

ఇప్పుడు ఈ విషయం పైనే టిడిపిలో అయోమయం నెలకొంది…మోడి చంద్రబాబును ఏపిని పట్టించుకోవం లేదు.

దానికితోడు రెండు రాష్ట్రాల్లోను సాధించిన మోడీ ఇప్పుడు ఏపీ పై చూపిస్తున్న తన ప్రభావం కంటే కూడ మరింత ఎక్కువగా తన ప్రభావాన్ని చూపించనున్నారు అని తెలుస్తోంది.మరి ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో అనేది ఇప్పుడు సర్వాత్ర ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube