కేసీఆర్ ని ఇబ్బంది పెట్టనున్న కోదండరాం నయా ప్లాన్ ఇదే

తెలంగాణలో నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నారు అంటూ మొత్తం నిరుద్యోగులని పోగేసి కోదండరాం చేసిన కొలువుల కొట్లాట ఎంత భారీ సక్సెస్ అయ్యిందో వేరే చెప్పవలసిన అవసరం లేదు.ఆ హీట్ ఇప్పటికీ కేసీఆర్ కి తగులుతూనే ఉంది.

 Kcr Tension For Kodandaram New Sketch-TeluguStop.com

ఉద్యమ సమయంలో పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ వచ్చిన కోదండరాం ఫ్యూచర్ లో ఎదురు నిలుస్తాడు అని బహుశా కేసేఆర్ అనుకుని ఉండరు.కొలువుల కొట్లాట తెలంగాణలో టీఆర్ఎస్ కి ఎదురులేదు అనుకున్నన కేసీఆర్ కి చుక్కలు చూపించింది అన్నది నిజం.

అయితే మరొక మారు కోదండరాం కేసీఆర్ కి చెమటలు పట్టించే పనిలో పడ్డారు.అత్యంత ముఖ్యమైన మరో సమస్యను తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదని.దానిపై సర్కారు మీద వత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు కోదండరాం.అదేమిటంటే…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల సంఖ్య 3362.అంటే సుమారుగా నెలకు 80 మంది అన్నదాతలు చనిపోయారు అన్నది జెఎసి చెబుతోంది.ప్రభుత్వ పథకాలన్నీ రాజకీయ నాయకులకు.కాంట్రాక్టర్లకు.మధ్య దళారులకు వరాలుగా మారుతున్నాయని జెఎసి ఆగ్రహం వ్యక్తం చేసింది.

రైతన్నకి భరోసా కల్పించడంలో కేసీఆర్ ఘోరంగా విఫలం అయ్యారని…మూడున్నరేళ్ల కాలంలో మీరు ఇచ్చిన ప్రకటనలతో నే రైతులు కడుపు నింపారు అంట తీవ్రంగా హెచ్చరించింది.అందుకే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదు.

దేశంలోనే తెలంగాణా నెంబర్ 1 అంటూ చెప్తున్నరు.మరి రైతులు పరిస్థతి ఎందుకు ఇలా ఉంది.

రాష్ట్రం అభివృద్దిలో ఉంది అంటే రైతులు సుఖంగా ఉంటేనే అంటూ జెఎసి విమర్శలు చేసింది.అంతేకాదు కొలువుల కొట్లాటకి ఎలా అయితే పిలుపు ఇచ్చారో అదే విధంగా రైతులతో కూడా ఒక సభ నిర్వహించి కేసీఆర్ కి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని జేఎసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి కేసీఆర్ ఈ విషయంలో ముదస్తూ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారో వేచి చూడాలి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube