రేవంత్ కి ఘోర అవమానం..

రేవంత్ రెడ్డి టి-టిడిపిలో ఉన్నంతకాలం రేవంత్ కి ఎక్కువ స్వేఛ్చ ఉండేది.టిడిపిలో తానూ చెప్పిన విషయానికి ఎవరు అడ్డు చెప్పేవారు కాదట.

 Revanth Reddy Insulted In Gandhi Bhavan-TeluguStop.com

ఎంతో ఫ్రీడం ఉండేది.అలాంటిది ఎటువంటి ముహూర్తంలో టిడిపిని విడిచి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టాడో కానీ పాపం రేవంత్ కి అన్నీ కష్టాలే.

కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళిన రేవంత్ ఇప్పుడు ఎవరు తనని పట్టించుకోక పోవడం.కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ ని పట్టించుకోక పోవడం జరుగుతోందట.

పాపం ఈ విషయాలు ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే ఇబ్బందులు పడుతున్నాడని టాక్.

తాజాగా జరిగిన ఒక సంఘటన వింటే మాత్రం రేవంత్ మీద జాలి చూపకుండా ఉండరు.

రేవంత్ కి గాంధీ భవన్ లో చేదు అనుభవం ఎదురయ్యింది.గాంధీభ‌వ‌న్‌లో సోనియా గాంధీ బ‌ర్త్ డే వేడుక‌లు గ్రాండ్‌గా జ‌రిగాయి.

ఈ వేడుక‌కి రేవంత్ రెడ్డి త‌న అనుయాయులు అందరినీ వెంటపెట్టుకుని మరీ హాజ‌ర‌య్యారు.అక్క‌డే ఆయ‌న‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్ త‌గిలింద‌ట‌.

కేక్ క‌టింగ్‌లు హ‌డావిడి ముగిసిన త‌ర్వాత గాంధీభ‌వ‌న్‌లోనే కాసేపు కూర్చుందామ‌నుకున్న రేవంత్ రెడ్డి వెయిటింగ్ రూమ్ కోసం వెదికార‌ట‌.అసలు రేవంత్ లాంటి వ్యక్తికీ అక్కడ ఒక రూమ్ కేటాయించాలి.

అక్క‌డ ఆఫీస్ బేర‌ర్స్‌కి ప్ర‌త్యేకమైన రూమ్‌లు ఇస్తారు.కానీ.

రేవంత్‌కి కాంగ్రెస్‌లో ఎలాంటి ప‌ద‌వీ కేటాయించ‌కపోవ‌డంతో ఆయ‌న పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రూమ్ లోకి వెళ్దాం అనుకుంటే అక్కడ ఉన్న ఆఫీస్ సిబ్బంది రేవంత్ ని అడ్డుకున్నారట.

ఉత్తమ కుమార్ లేనందువల్ల ఆ రూమ్ లోకి వెళ్ళడం కుదరదు అని తేలిచి చెప్పేశారట.

ఈ పరిణామానికి ఒక్క సారిగా షాక్ అయిన రేవంత్ రెడ్డి మరి ఎక్కడ వెయిట్ చేయాలి రూమ్ లేదా అని అడిగితే వెయిటింగ్ హాల్ ఉందిగా అక్కడ వెయిట్ చేయండి అన్నారట.అనుచర గణంతో ఎంతో డాబు దర్పాన్ని ప్రదర్శిస్తూ వెళ్ళిన రేవంత్ కి కోపం వచ్చి ఏమి చేయాలో తెలియక బయటకి వచ్చేశారట.

గాంధీ భవన్ లో పరిస్థితిలు రేవంత్ కి తెలియదు కాబోలు.ఎంత పెద్దవాళ్ళు అయినా సరే ఇక్కడ ఇదే పరిస్థతి పదవులు ఉంటేనే ఆహ్వానం చాలా హుందాగా ఉంటుంది అని సీనియర్ నాయకుడు చెప్పడంతో…పదవి వచ్చిన తరువాతే మళ్ళీ గాంధీభవన్ లోకి అడుగుపెట్టాలి అని నిర్ణయించుకున్నారట రేవంత్.

రాహుల్ పట్టాభి షేకం ఈ నెల 16 జరగబోతోంది కావున ఆ తరువాత రేవంత్ కి ఏదన్నా పదవి ఇస్తేనే కానీ టి- కాంగ్రెస్ లో గౌరవం దక్కేలా లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి అనుచరులు మరి రాహుల్ ఎప్పటికి రేవంత్ ని కరునిస్తాడో వేచి చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube