MP Rammohan Naidu Strong Reply To Pawan Kalyan

పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటివరకు ఈ పేరు చెప్తే కుర్రాళ్ళ నుంచీ పెద్దల వరకూ అందరు ఎంతో ఆసక్తిగా ఉండేవాళ్ళు.పవన్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు అనగానే సమాజానికి ఎంతో కొంత న్యాయం చేస్తాడు అనే భావన కొంతమందిలో ఉంది.

 Mp Rammohan Naidu Strong Reply To Pawan Kalyan-TeluguStop.com

అయితే.అదంతా గతం త్వరలోనే సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చి పొలిటికల్ వైపు పరుగులు పెట్టాలని జనసేనని ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి అని చుసిన పవన్ కళ్యాణ్ ఆ దిశగానే వైజాగులో ఉద్యోగుల స్వమస్యలోపై స్పందిచడానికి వెళ్ళాడు.

తరువాత పోలవరాన్ని సందర్సించడానికి వెళ్ళాడు.ఈ సందర్భంలోనే పవన్ తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు

నిన్న పోలవరం సందర్శించిన పవన్.

అక్కడ వారసత్వ రాజకీయాలమీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి.వారసత్వ రాజకీయ నాయకులు తామెంటో నిరూపించుకుని తరువాత పదవుల గురించి ఆలోచించాలని పవన్ నీటి సూక్తులు భోదించాడు.

అసలే పవన్ కి నోటి దూల ఎక్కువ అని అంటారు చాలా మంది.అది కూడా అనేక సందర్భాలలో నిరూపితం అయ్యింది.

అయితే ఇప్పుడు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి.ఎలాగో జనసేన టిడిపితో వచ్చే ఎన్నికల్లో జట్టు కట్టడం ఖాయం అయితే.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టిడిపిలో పోగల సెగలు రేపుతున్నాయి

శ్రీకాకుళం నేత దివంగత.టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు తనయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు పవన్ కామెంట్ల పై చాలా సీరియస్ గా స్పందించారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు.మేము రాజకీయాల్లోకి వారసత్వం రూపంలో వచ్చినప్పటికీ…మాకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపును సంతరించుకున్నామని తెలిపారు.

తమని తాము నిరూపించుకోవడానికి ఎవరికీ అయినా సరే ఒక అవకాశం దొరకాలని.ఈ విషయాలి పవన్ తెలుసుకుని మాట్లాడాలని అన్నారు

అయితే పవన్ లోకేష్ మీద చేసిన కామెంట్స్ కి కూడా రామ్మోహన్ నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు.

లోకేష్ ఒక ఐటీ మంత్రిగా.పంచాయతీ మంత్రిగా నవ్యాంద్రాలో తీసుకు వస్తున్న మార్పులు తెలుసుకోవాలని తెలిపారు.

లోకేష్ ఏపీ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని ఈ విషయాలని కూడా పవన్ తెలుసుకుని మాట్లాడటం మంచిది అని తెలిపారు

ఇప్పటికే పలు ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చిన లోకేష్ తను తానూ ప్రూవ్ చేసుకున్నారని తెలిపారు

ఎంతో సౌమ్యంగా ఉంటూ.తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు.

ఎప్పుడు కూడా ఇంత అసహనాన్ని వ్యక్తపరచలేదు.అలాంటి వ్యక్తికే కోపం వచ్చింది అంటే ఆశ్చర్యంగా ఉంది అని.దీన్ని బట్టి పవన్ వ్యాఖ్యలు ఎంత అనాలోచితంగా ఉన్నాయో తెలుస్తోంది అని.ఈ వ్యాఖ్యలతోనే పవన్ రాజకీయ పరిణితి సినిమా డైలాగుల వరకే పరిమితం అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube