తెలంగాణా టిడిపి పగ్గాలు ఎవరికో తెలిస్తే షాకే

అవును మీరు వింటోంది నజమే.ఇప్పుడు టిడిపిలో ఇదే హాట్ టాపిక్.

 Chandra Babu Shocking Decision-TeluguStop.com

ఇప్పుడు ఏపీలో టిడిపి ఫుల్ జోష్ లో ఉంది.నంద్యాల గెలుపు తరువాత టిడిపి దూకుడుని వైసీపి శ్రేణులు ఎదుర్కోలేక పోతున్నాయి.

అంతేకాదు నంద్యాల గెలుపు ని దృష్టిలో పెట్టుకుని వైసీపి నేతలు ఒక్కొక్కరుగా టిడిపిలోకి క్యూ కడుతున్నారు.అందుకే వీలు కుదుర్చుకుని మరీ చంద్రబాబు టి టిడిపి పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది

రేవంత్ రాజీనామా తరువాత టి టిడిపి పరిస్థతి ఎంతో దారుణంగా తయారయ్యింది.

అప్పటివరకూ పార్టీని వెన్నంటి కాపాడిన వాళ్ళు అందరు ఇప్పుడు పార్టీని వదిలి పోవడంతో టిడిపికి సరైన దారి లేకుండా పోయింది ఇలాంటి సమయంలో “టి-టిడిపి” కి కొత్త ఊపు తీసుకుని రావాలి అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు అని తెలుస్తోంది.ఇప్పుడు ఉన్న పార్టీ అధ్యక్షుడు ఎంతో సౌమ్యుడు గా పేరు ఉంది సో ఇలాంటి సమయంలో రమణ కంటే బెటర్ గా అందరిని కలుపుకుని పోయి పార్టీని నడిపించగల సత్తా లేద‌నే కామెంట్స్ ఉన్నాయి.

అందుకే, చంద్ర‌బాబు బ్రాహ్మ‌ణివైపు మొగ్గు చూపుతున్నార‌ట‌

టి టిడిపికి తెలంగాణలో మంచి కేడర్ ఉంది కానీ అక్కడ పార్టీని నడిపించగల నాయకుడు మాత్రం కరువయ్యాడు.ఈ సారి కనుకా సరైన వ్యక్తికీ భాద్యత కనుకా ఇవ్వక పొతే టిడిపి తెలంగాణలో కనుమరుగవుతుంది అంటున్నారు విశ్లేషకులు అందుకే చంద్రబాబు వాడి వాడిగా టిటిడిపి పై నిర్ణయాలని తీసుకుంటున్నారు.

ఆ బాధ్య‌త‌ల‌ను త‌న కోడ‌లు నారా బ్రాహ్మ‌ణిపై పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌…వచ్చే ఎన్నికల్లోగా బ్రాహ్మణికి టి టిడిపిలో కీలక భాద్యతలు ఇస్తేనే మంచిది అని భావిస్తున్నారు చంద్రబాబు.హైదరాబాదు నుంచీ ఎదో ఒక నియోజకవర్గం నుంచీ ఆమెని పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారట.

అయితే జనవరి తరువాత మాత్రం బ్రాహ్మణి టి టిడిపి అధ్యక్షురాలు అవ్వడం మాత్రం ఖాయం అంటున్నారు టిడిపి నాయకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube