“టీ” కాంగ్రెస్ లో విజయశాంతి తుఫాను

ఒక పక్క ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.అన్ని పార్టీలకి ఒక్కటే లక్ష్యం గెలుపు.

 T-congress Seniour Leaders Big Fight For Vijayashanthi Entry-TeluguStop.com

ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి గెలుపు రాకపోతే అది అతిపెద్ద అవమానం.ప్రతిపక్షం లో ఉన్న వాళ్ళు అధికారంలోకి రాకపోతే ఇక ఆ పార్టీ పెట్టె బేడా సర్దేసుకోవడమే ఇప్పుడు అన్ని పార్టీల ముందు ఉన్న అతి పెద్ద సవాల్ 2019 అసెంబ్లీ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

అయితే ఏపీలో మాత్రం ట్రయాంగిల్ పోటీ నెలకొంటే.తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్యే పోటీ అంతా ఉంది.

అయితే ఇప్పుడు టి- కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిఆర్ఎస్ కి కలిసొచ్చే లా ఉంటున్నాయి

ఎలక వాదన –పిల్లి వాదనా కోతి తీర్చింది అని ఇప్పుడు టి-కాంగ్రెస్ లో సీనియర్ లీడర్స్ మధ్య వస్తున్నా గ్యాప్ లు టీఆర్ఎస్ కి కలిసోచ్చేలా ఉన్నాయి.అసలు సీనియర్స్ మధ్య గొడవలు రావడానికి కారణం ఎవరు అని ఆలోచిస్తే కొన్ని ఆసక్తి కరమైన విషయాలు బయటపడుతున్నాయి.అదేమిటంటే

టి-కాంగ్రెస్.టీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.తమకున్న ఆయుధాలని ఒక్కొక్కటిగా బయటకి తీస్తోంది.ఇదంతా ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి నాయకత్వంలో జరుగుతోంది.

అయితే ఇప్పుడు చాలా మంది సీనియర్ నాయకులకి ఉత్తమ దూకుడు మింగుడు పడటం లేదు.ఉత్తమ్ వ్యుహాలన్ని ఉత్తుత్తి వ్యుహాలే అంటూ కొట్టిపడేస్తోంది.

ఉత్తమ మొట్టమొదటి తప్పు రేవంత్ ని పార్టీలోకి తీసుకురావడమే.అంటూ విరుచుకు పడుతున్నారు కొంతమంది సీనియర్ నాయకులు.

రెండవ తప్పు విజయశాంతి ని కాంగ్రెస్ లోకి తీసుకురావడం రాహుల్ గాంధి దగ్గరకు తీసుకుని వెళ్లి కోర్చోబెట్టడం.అనేది వారి వాదన

టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు విజయశాంతి కాంగ్రెస్ నేతలని ఒక ఆట ఆడుకుంది.

అప్పట్లో ఆమె భాదితులు ఇప్పుడు విజయశాంతి రాకని వ్యతిరేకిస్తున్నారట.విజయశాంతి వల్ల లాభం ఉండదు అంటూ ఏకంగా అధిష్టానం ముందు చెప్పేశారట ఈ సినియర్ నేతలు.

రాహుల్ గాంధీతో ఇప్పటివరకు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కనీసం ఫోటోలు కూడా దిగలేదని, అలాంటిది రీఎంట్రీ పేరుతో రాములమ్మను రాహుల్ దగ్గర ప్రవేశ పెట్టడం విడ్డూరంగా ఉందని వాళ్లలో వాళ్లే అనుకుంటున్నారు.విజయశాంతి రాకని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళలో జానారెడ్డి లాంటి నాయకులు కూడా ఉన్నారట అసలు.

జానారెడ్డి కి విజయశాంతి ఒక్క విషయంలో మాత్రమే కాదు రేవంత్ ని కాంగ్రెస్ లోకి తీసుకురావడం జనారెడ్డి కి అస్సలు ఇష్టం లేదు.మాకు తెలియకుండా మాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా రేవంత్,విజయశాంతి లని రాహుల్ కి ఉత్తమ్ పరిచయం చేయడంపై సీనియర్స్ అందరు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

టిఆర్ఎస్ ని ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలి కాంగ్రెస్ అనుకుంటే విజయశాంతి ఎంట్రీతో నేతల మధ్య నెలకొన్న యుద్ధం వల్ల టి –కాంగ్రెస్ దేంట్లో కలిసిపోతుందో అని తెగ కంగారు పడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube