జగన్ పాదయత్రకి పవన్ బ్రేకులు

ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో నేతల పాదయాత్రలు ఇప్పుడు చాలా కామన్ గా జరిగిపోతున్నాయి.ఎన్నికల్లోగా ఎదో ఒకటి చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎవరికీ వారు పోటీ పడుతున్నారు.

 Pawan Kalyan Going To Start Padayatra…soon-TeluguStop.com

నవంబర్ 6 వ తేది జగన్ పాదయాత్ర మొదలు పెడితే.నీ యాత్రకి బ్రేకులు నేను వేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ కూడా యాత్రకి సిద్దం అయ్యాడు.

సినిమా షూటింగ్ అవ్వగానే యాత్రకి రంగం సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం

పవన్ 2014లోనే పార్టీ పెట్టినా కేవలం టిడిపికి సపోర్ట్ చేయడంతోనే సరిపెట్టారు.ఈ సారి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్న కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పవన్ కూడా పాద‌యాత్ర‌, లేదా బ‌స్సు యాత్ర‌ల‌కు సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

తొందరలోనే యాత్ర మొదలుపెట్టి ప్రజల్లో తిరగాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడు.ఒకపక్క వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి హామీల వర్షంతో ప్రజలలోకి వెళ్తూ ప్రజా సంకల్ప యాత్రని సక్సెస్ చేస్తున్నాడు.

జగన్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే జగనే నెక్స్ట్ సీఎం అవుతాడా అన్నట్టుగా ఉంటోంది ప్రస్తుత పరిస్థతి

అయితే ఇప్ప‌టికే పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌తో పోల్చుకుంటే ప‌వ‌న్ పాద‌యాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతోంది.దాని ప్ర‌భావం ఎంత‌ మేరకు ఉంటుంది , ప‌వ‌న్ ప్రజలని త‌న‌వైపు తిప్పుకోగ‌ల‌డా, పాద‌యాత్ర లేదా బ‌స్సు యాత్ర విజ‌య‌వంతం అవుతాయా అనే సందేహాలు ఇప్పటికే అందరిలో కలుగుతున్నాయి.

మాములుగానే పవన్ ఒక సినిమా స్టార్.అతనిని చూడటానికి అయినా సరే ప్రజలు బయటకి వస్తారు.

సో ప్రజల రెస్పాన్స్ మాత్రం పవన్ యాత్రకి ఉంటుంది అనడంలో సందేశం లేదు.కానీ పవన్ వచ్చిన వాళ్ళని ఓట్లుగా మలుచుకుంటాడా లేదా అనేది.

జనసేనాని మీదే ఆధారపడి ఉంది అయితే పవన్ పాదయాత్ర ద్వారా జగన్ యాత్రకి గండి పడినట్లే ఎదుకంటే భారీ స్థాయిలో పవన్ యాత్రకి ప్రజలు వెళ్ళడం ఖాయం ఈ ప్రభావం జగన్ పాదయాత్రపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అనడంలో సందేశం లేదు అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube