Revanth Reddy Shocking Comments On KCR,KTR

రేవంత్ రెడ్డి కేటిఆర్ కి కేసీఆర్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఎకైక వ్యక్తి.నా కొడంగల్ కోటలోనే వేలు పెడితే ఊరుకుంటానా అంటూ మళ్ళీ మీడియా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు.

 Revanth Reddy Shocking Comments On Kcr,ktr-TeluguStop.com

ఒకపక్క కేసీఆర్ రేవంత్ ని ఒంటరిని చేయాలని చూస్తు రేవంత్ వర్గాన్ని కారు ఎక్కిస్తుంటే రేవంత్ మాత్రం చాలా తెలివిగా ఏకంగా టీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే పనిలో పక్కా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు.ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ మొత్తానికి ఎదో సంచలం దిశగా రేవంత్ పయనిస్తున్నాడు అని తెలుస్తోంది

రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటిఆర్ టార్గెట్ గా డ్రగ్స్ కేసుకి సంభందించి మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం కలిగించాయి.

రేవంత్ ఏకంగా కేసీఆర్ అల్లుడిపై సంధించిన బాణం కేటిఆర్ కి గట్టిగా తగిలింది.అప్పట్లో ఆ మాటల వెనుక ఉన్న మర్మం ఎవ్వరికీ అర్థం కాలేదు.

కేసీఆర్ ని మనుమడు చదువుతున్న స్కూల్ లో డ్రగ్స్ విషయంలో పోలీసుకు స్కూల్ కి నోటిసులు ఇచ్చారు దీనికి మీ వివరణ ఏమిటి అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు.మళ్ళీ చాలా రోజుల తరువాత రేవంత్ తన ఇంటివద్ద ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాటల దాడి చేశారు.

మళ్ళీ డ్రగ్స్ కేసు విషయాన్ని తెరమీదకి తెచ్చారు

డ్రగ్స్ కేసులో ఎటువంటి వారు ఉన్నా చివరకి టీఆర్ఎస్ నేతలు ఉన్నా సరే వదలం అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పటివరకు కేసుని చేదించక పోగా.ఇప్పుడు మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పబ్బులకి అనుమతించడం ఎంతవరకు సమంజసం.

అంతేకాదు గోవా లాంటి ప్రభుత్వం సన్బర్న్ ,రేవ్ పార్టీలలో డ్రగ్స్ ని నియంత్రించలేక.వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది దానికి ప్రధాన కారణం డ్రగ్స్.

అటువంటి పార్టీలని కేటిఆర్ హైదరాబాద్ లో నిర్వహించేలా అనుమతులు ఇవ్వడం స్వయంగా తానూ కూడా పాల్గొని ఇటువంటి వాటి వల్ల ఐటీ హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం ఎంతో ఘోరమైన విషయం అన్నారు రేవంత్

కేటిఆర్ బామ్మర్ది ఈ పార్టీలని నిర్వహిస్తున్నాడని.ఈ పార్టీలకి టికెట్స్ 3 వేలనుంచీ లక్ష రూపాయల వరకూ అమ్ముతున్నారు అని కేవలం కేటిఆర్ తన భందువుల కోసం తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ తెలంగాణా మార్చుతున్నారు అని విరుచుకుపడ్డారు.

ఎంతో మంది మేధావులు,విద్యార్ధులు , మధ్యతరగతి ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణా తెస్తే కేసీఆర్ తన బందు గణంతో డ్రగ్స్ తెలంగాణాగా మార్చుతున్నారు అని మండిపడ్డారు.ఈ మధ్యకాలంలో సుమారు 59 పబ్స్ కి అనుమతులు ఇచ్చారు అని.15 ఏళ్ళు వయసున్న మైనర్లు కూడా పార్టీలకి వస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది అంటూ తీవ్రమైన విమర్శలు చేశారు.కేసీఆర్ ,కేటిఆర్ లు తెలంగాణా మధ్యతరగతి ప్రజల గొంతు నొక్కేలా.

వారి జీవితాలు నాశనం చేసేలా చేస్తున్న పనులకి సమాధానం చెప్పే రోజు వస్తుందని.డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తాను అని రేవంత్ హెచ్చరిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube