తెలంగాణా బిజేపి నేతలకి కెటిఆర్ షాక్

తెలంగాణా బిజేపి గాడి తప్పింది.అసలు తెలంగాణలో బిజెపి ఉందా లేదా.

 Telangana Bjp Leaders Wants To Ktr Friendship-TeluguStop.com

అనే సందేహాలు కలుగుతున్నాయి.దేశంలో ఎటువంటి రాజకీయ పార్టీ అయినా సరే అధిష్టానం మాటలు వినాల్సిందే.

అందులోనూ బిజేపి అయితే క్రమశిక్షణకి పెట్టింది పేరు.అయితే తెలంగాణలో బిజెపికి మాత్రం ఇవేమీ పడవు అమిత్ షా అన్నా ,హైకమాండ్ భోదనలు అన్నా సరే మా ముందు పనికి రావు అంటున్నట్టుగా ఉంది వారి పరిస్థతి

ముక్కి మూలిగితే బీజేపీ త‌ర‌పున ఉన్న‌దే ఐదుగురు లీడ‌ర్లు…వాళ్ళలో ఒకరు ది మోస్ట్ సీనియర్ రిటైర్మెంట్ లో ఉన్న దత్తాత్రేయ.

మిగిలిన వాళ్ళు న‌లుగురులో కిష‌న్‌రెడ్డి.ల‌క్ష్మ‌ణ్‌.

ముర‌ళీధ‌ర్‌రావు.చింత‌ల రామ‌చంద్రారెడ్డి.

వీరిలో మురళీధర్ మాత్రం అప్పుడప్పుడు టీవీలలో కనిపిస్తూ ఉంటారు.అంతే తప్ప మిగిలిన ఎవ్వరు కూడా అసలు బిజెపిలో ఉన్నారో లేరో కూడా తెలియడంలేదు

మిగిలిన నాయకులు అసలు మేము వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అనేట్టుగా ఉన్నారు.

అయితే తెలంగాణా బిజెపి నాయకులు మాత్రం టిఆర్ఎస్ తో దోస్తీ ఉంటేనే బాగుంటుంది అంటూ స్నేహభందం కోసం వేచి చూస్తున్నారు.మరి కొతమంది అయితే వేచి చూసే దొరణి నుంచీ రాసుకు పూసుకుని తిరిగే స్టేజ్ కి వెళ్ళిపోయారు.

దానికి ఉదాహరణే

మంత్రి కేటీఆర్ క‌లిసి వీరు చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు.టి-బిజేపిలో ఇప్పుడు సమన్వయము కొరవడింది.

గుజరాత్ ఎన్నికల నేపధ్యంలో అమిత్షా బిజీగా ఉండి రాష్ట వ్యవహారాలూ పట్టించుకోవడం లేదు దాంతో కొంతమంది టి –బిజెపి నాయకులు కేటీఆర్‌ భజన చేస్తున్నారు

అదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ద‌త్తాత్రేయ బీజేవైఎం నేత‌ల‌తో ప్రెస్‌మీట్ పెట్టారు.ఉద్యోగాల క‌ల్ప‌న‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

బీజేవైఎం పోరాటాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.కానీ దత్తాత్రేయ ప్రకటన వెలువడుతున్న సమయంలోనే బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిటీ సెంట్రల్ లైబ్ర‌రీ ద‌గ్గ‌ర కేటీఆర్‌తో నిరుద్యోగుల‌తో మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే బిజెపిలో ఉన్న నాగం గత కొంతకాలంగా ఆ పార్టీ ఉంచీ బయటకి రావాలని చూస్తున్నారు.కాంగ్రెస్ తో తెరచాటు మంతనాలు నడిపిస్తున్న నాగం ఏ క్షణమైనా సరే కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొత్తానికి కేటిఆర్ ఎఫెక్ట్ తో టి- బిజెపిలో అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube