రేవంత్ మార్క్ స్కెచ్..జానారెడ్డికి షాక్

రేవంత్ కి టిడిపిని విడిచి కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చాడు.వచ్చిన తరువాత తన ఉపాయం ఏమిటి? తన ఆలోచనలు ఎటువైపు సాగుతున్నాయి అనేవిషయం ఎవ్వరికి తెలియడం లేదు.అయితే ఇప్పటికే రేవంత్ కాంగ్రెస్ లో చాల మంది సీనియర్స్ ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు.అయితే బిజేపి రేవంత్ కోసం తలుపులు తెరిచి ఉంచినా తనకి ఉన్నతమైన స్థానం కలిపిస్తాము అని చెప్పినా సరే వినకుండా కాంగ్రెస్ లోకి వెళ్ళడం వెనుక రేవంత్ మాత్రం ఒక పక్కా స్కెచ్ తోనే ఉన్నాడు అని తెలుస్తోంది

 Revanth Reddy Super Sketch For Future Politics-TeluguStop.com

అయితే ఎప్పటినుంచో కేంద్రంలో ఉండి చక్రం తిప్పుతూ లోక్ సభలో తెలంగాణా బిల్ పాస్ కావడానికి ముఖ్య కారకుడు అయిన జైపాల్ రెడ్డిని ముందు ఉంచి వెనుక తానూ చక్రం తిప్పే ప్లాన్ లో ఉన్నాడని టాక్.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ నుంచి ఇమేజ్ ఉన్న ఒక నాయకుడి పేరును హైలెట్ చేయాల్సి ఉంది.అయితే అటువంటి పేరు తనకే కావాలి అని కోరుకునే వ్యక్తీ జనా రెడ్డి.

అయితే జానారెడ్డికి కేసీఆర్ అనుకూలంగా ఉన్నాడు అనే వ్యాఖ్యల నేపధ్యంలో ఆయన కాకుండా మరో వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపైకి తీసుకొస్తే మంచి ఫలితాలు వస్తాయని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచించారని తెలుస్తోంది

జైపాల్ రెడ్డి మాత్రమే దీనికి అన్ని విధాలా అర్హుడు అని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం.ఎన్నికలకు ముందు జైపాల్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకొస్తే ప్రజల్లోనూ కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరుగుతుంది.

అంతేకాదు జైపాల్ ని పార్టీలో ఎవ్వరు వ్యతిరేకించే వారు లేరు.ఇదే విషయాన్ని రేవంత్ కాంగ్రెస్ హై కమాండ్ కికూడా వివరించినట్టుగా సమాచారం.ఇప్పుడు ఈ విషయం తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారింది.చాలా మంది నాయకులు జైపాల్ రెడ్డి అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని బాహాటంగా చెప్తున్నారట.

మరి రేవంత్ వేసిన ఈ స్కెచ్ ఫలిస్తుందా లేదా అనేది కాలమే నిర్నైస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube