పవన్ ఇమేజ్ డ్యామేజ్ కారణం వీళ్ళే

జనసేనాని ఒకపక్క ఎన్నో కష్టాలు అనుభవిస్తూ.ఒంటి చేత్తో పార్టీని ముందుకు తీసుకువెళ్ళేలా ప్రయత్నాలు చేస్తున్నాడు…ఒక పక్క వైసీపి జనసేన పార్టీని చూసి బెంబేలెత్తి పోతోంది.

 Pawan Kalyan Wrong Decisions Affected Janasena Party-TeluguStop.com

టిడిపి అయితే జనసేనుడితో దోస్తీ కోసం తహ తహ లాడుతూ ఉంటోంది.యువకుల్లో జనసేన పట్ల పిచ్చ క్రేజ్ కూడా ఉంది.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటుకునే కెపాసిటీ జనసేనకి మాత్రం మెండుగా ఉంది.కోట్లాది మంది అభిమానులని ఒక బక్క పలుచటి మనిషి ఇంతలా సంపాదించుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.

అలాంటి పవన్ కళ్యాణ్ జనసేన ఒక్కసారిగా కదన రంగంలోకి దూకడానికి సిద్దంగా ఉన్న సమయంలో తన ఇమేజ్ కి భారీ డ్యామేజ్ జరుగుతోంది అనేది వాస్తవం

జనసేనకి జరుగుతున్నా భారీ డ్యామేజ్ వెనుకలా కారణాలు ఒక్కసారి పరిశీలిస్తే ప్ర‌జారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ చేసిన ప్రసంగాలలో అప్పుడు కనిపించిన వేడి ఇప్పుడు కనపడటం లేదు.ప్రత్యెక హోదానే తన ధ్యేయం అని ప్రకటించిన పవన్ హోదా కోసం ఎంతకైనా తెగిస్తాను అని చెప్పిన పవన్ ఇప్పుడు మిన్నకుండి పోయాడు ఆ సమయంలో ఎంపీలు చేతకాని ద‌ద్ద‌మ్మ‌లు అని కాకినాడ స‌భ‌లో ప‌వ‌న్ విరుచుకుపడ్డాడు.

అదే సమయంలో యువతలో ప్రత్యెక హోదా అంశం బలంగా నాటుకు పోయింది

విశాఖపట్నం లో హోదాకోసం జల్లికట్టు స్పూర్తితో తలపెట్టిన ప్రత్యేక హోదా యువభేరి కోసం పవన్ యువతకి పిలుపు ఇచ్చాడు.ఈ పిలుపుతో రాష్ట్రా వ్యాప్తంగా ఎంతో మంది యువకులు.

అభిమానులు పెద్ద ఎత్తున విశాక బీచ్ కి వచ్చి చూసే సరికి పవన్ ఎక్కడా కనపడలేదు పైగా పోలీసుల లాటీ దెబ్బలు తిని జైలుకు చాలా మంది వెళ్ళారు.అదే సమయంలో జగన్ అక్కడకి వెళ్లి ఆ క్రెడిట్ కొట్టేశాడు.

ఆ విషయంలో పవన్ పార్టీ అట్టర్ ప్లాప్ అయ్యింది అంతేకాదు అభిమానులలో యువకుల్లో పవన మీద నమ్మకం క్రమేపి తగ్గుతూ వచ్చింది.తరువాత తాయితీగా మీడియా ముందుకు వచ్చిన పవన్ అరెస్ట్ అయ్యిన వాళ్ళకోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా.

శాంతి భద్రతల దృష్ట్యా రావడం కుదరలేదు అని చావు కబురు చల్లగా చెప్పాడు.మరి ఒక పార్టీ అధ్యకుడిగా ఈ విషయం ముందే తెలియదా.

ఉత్తర దక్షిణ భారత దేశాలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్నీ కావు.అమెరికాలోని హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో ప్ర‌సంగించేందుకు వెళ్లి తన పరువు అంతర్జాతీయ స్థాయిలో పోగొట్టుకున్నాడు అనేది వాస్తవం.

ఏపీలో ప్రసంగాలతో దుమ్ము రేపేసే పవన్.అక్కడ ఎలా మాట్లాడుతాడో అని అందరు భావిస్తే.

ద‌క్షిణ భార‌త‌దేశంపై ఉత్త‌ర భార‌త‌దేశం వివ‌క్ష చూపిస్తుంద‌ని మాట్లాడారు.పవన్ మాటలు ఆసమాయలో అందరికీ ఆమోదయోగ్యంగా లేవు.

అంతేకాదు టిటిడి ఈవో విషయంలో కూడా పవన్ వ్యాఖ్యలు మళ్ళీ సంచలనం అయ్యాయి.ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన ఐఏఎస్ అధికారిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోగా ఎలా నియ‌మిస్తార‌ని ప‌వ‌న్ అడగటం తనకి ఇంకా రాజకీయ పరిణత రాలేదని స్పష్టంగా తెలుపుతోంది

స్పష్టత లేని మాటలు మాట్లాడటం.

మాట్లాడక నాలిక కరుచుకోవడం జనసేనానికి అలవాటే.సమాజంలో రిజ‌ర్వేష‌న్లు ఉండటం సరైనది కాదు అంటూనే.

టిడిపి ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని కోరడం ఎలా అర్ధం చేసుకోవాలి?ఏదన్న ఒక విషయంలో రాజకీయ నాయకులని మీడియా మిత్రులు అడిగినపుడు వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే సమాధానం.”నో కామెంట్స్”.

”చట్టం తనపని తానూ చేసుకుపోతుంది” అని చెప్పడం.కానీ పవన్ కళ్యాణ్ దీనికి భిన్నంగా “ అరాచక శక్తులు వస్తాయి నేను వస్తే అంటూ” అంటూ తప్పించుకోవడం పరిపాటి.

ఆక్వా మెగా ఫుడ్ పార్క్ విషయంలో మరియు గరగపర్రు.ద‌ళిత ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా రావాల‌ని ప‌వ‌న్‌ని కోరిన‌ప్పుడు కూడా “నేను వ‌స్తే అరాచ‌క శ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మాట్లాడారు”.

ప్రజా పోరాటంలో నాకు చేగువేరా స్పూర్తి అని చెప్పే పవన్ అరాచక శక్తులు వస్తాయి అన్ని చెప్పి ప్రతీ విషయంలో తప్పించుకుని తిరగడం ఎంతవరకు సమంజసం.తాను ప్రజా నాయకుడా ? కాదా ? అనే ప్రశ్న ఇప్పటికే చాలా మంది ప్రజలలో మెదులుతూనే ఉంది

అయితే తెలుగు దేశం ప్యుహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరు.జ‌న‌సేన‌.ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లని ఒకేసారి నిర్వీర్యం చేయాలని సాగుతున్న కుట్రలు తిప్పికొట్టే ప్యుహం రచించగల సమర్ధులు జనసేనలో లేరు అనేది సత్యం.ఈ విషయంలో పవన్ అభిమానులు కూడా ఆవేదనతో ఉన్నారు అని తెలుస్తోంది.పవన్ కూడా తన చుట్టూ ఉండే కోట‌రీపై అసంతృప్తితో ఉన్నారు అని కూడా టాక్.

జనసేనలో ఉన్న కొతమంది ముక్యమైన నాయకులు పవన్ కళ్యాణ్ కి కొన్ని వాస్తవాలు తెలియనివ్వడం లేదని.అందుకే పవన్ కొన్ని విషయాలలో నష్టపోతున్నారు అని మరి కొతమంది నాయకులు వాపోతున్నారు.

ఏది ఏమైనా పవన్ వేసే ప్రతీ అడుగులో జనసేన కోటరీ అండగా ఉండాలి.పవన్ ఏ విషయం మీద మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చి వివరించవలసిన భాద్యత చుట్టూ ఉన్న కోటరీపైనే ఉంది.

కానీ వాళ్ళు చేసే తప్పుల వల్ల పవన్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ కావడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube