సీతాఫలంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు

ఈ సీజన్ లో సీతాఫలం విరివిగా దొరుకుతుంది.సాధారణంగా సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఉండరు.

 Custard Apples, Custard Apple For Health, Health Tips, Telugu Health-TeluguStop.com

వర్షాకాలం చివరి రోజుల్లో శీతాకాలం మొదటి రోజుల్లో సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతాయి.సీతాఫలం తియ్యగా ఉండి తినటానికి చాలా రుచిగా ఉంటుంది.

ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు.

సీతాఫలంలో కాల్షియమ్,విటమిన్ ‘సి’, పీచు పదార్ధం, కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి.

తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అలాగే గుండె కొట్టుకొనే తీరును క్రమబద్దీకరణ చేయటంలో చాల సహాయపడుతుంది.
మలబద్దకంతో బాధపడేవారు ప్రతి రోజు ఒక పండు తింటే ఆ సమస్య నుండి బయట పడతారు.

పోటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్త ప్రసరణ బాగా జరిగేలా సహాయపడుతుంది.

సీతాఫలంలో ఉండే మెగ్నీషియం శరీరంలో ఉండే కండర వ్యవస్థని గట్టిపరుస్తుంది.

గుండె జబ్బులు ఉన్నవారు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.దీన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

Telugu Cud Apple, Cud Apples, Tips, Telugu-

ఒక్క సీతాఫలం పండే కాదు.ఆకులు ఉపయోగపడతాయి.ఆకుల్లోని హైడ్రోస్తెనిక్‌ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.

సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు.

గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి.పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది.

మధుమేహ వ్యాధి గ్రస్తులు, అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండును డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి.

జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.

సీతాఫలాన్ని చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.
>

ముఖ్యమైన గమనిక మోతాదుకు మించి తీసుకోకూడదు.

కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.అలాంటి సమయంలో వేడినీరు తాగినా.

అర స్పూన్ వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నా సీతాఫలాన్ని తప్పకుండా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube