కేంద్రం మళ్ళీ షాక్..2000 రద్దు ?

మళ్ళీ పెద్ద నోట్ల రద్దు వార్తలు దేశాన్ని చుట్టేస్తోంది.అందరిలో మళ్ళీ ప్రజలలో కలకలం సృష్టిస్తోంది…రెండు రోజుల క్రితమే పెద్ద నోట్ల రద్దు జరిగి సరిగ్గా సంవత్సరం అయ్యింది.

 Rbi Stop Printing 2000 Notes..-TeluguStop.com

ఆసమయంలో ఎంతో మంది తీవ్రమైన భాదలు పడ్డారు.సామాన్యులని మోడీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకి గురిచేసింది అని రాహుల్ విమర్శించారు.

నోట్ల రద్దు విషయం ఆయుధంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం పై మాటల దాడి చేసి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలని చూశారు

మళ్ళీ ఇప్పుడు 2000 రద్దు విషయం పెద్ద దుమారాన్నే రేపనుంది.ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ కి అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు త్వరలో చేపట్టబోతున్న రాహుల్ కి కలిసొచ్చే అంశం.

అయితే 2000 రూపాయల నోటును కూడా త్వరలో రద్దు చేసేస్తారని ఈ మధ్య చాలా ఆంగ్ల దిన పత్రికల్లో కథనాలు వచ్చాయి.రిజర్వ్‌బ్యాంక్‌ వర్గాలు కూడా రద్దు జరగవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.ఇటీవల ఒక టీవీ చానెల్‌ సమాచార హక్కు చట్టం కింద వివరణ అడగ్గా, ఆర్‌బీఐ అనుబంధ ప్రింటింగ్‌ సంస్థ-సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ముద్రించాలని ఆర్‌బీఐ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదని బదులు ఇచ్చింది .బదులిచ్చింది

ప్రస్తుతం మాత్రం రూ.500 నోట్లను , రూ.5, రూ.2 నోట్లను మాత్రమే ముద్రిస్తున్నాం అని సంస్థ పేర్కొంది.దీంతో రూ.2000 నోటు రద్దు తథ్యం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆర్‌బీఐ ఆదేశాలు రాకపోవడం తాత్కాలిక వ్యవహారమేనా? లేక కేంద్ర నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఆదేశాలు జారీ చేయడం లేదా అన్నది తెలియాల్సి ఉంది.ప్రవేశపెట్టిన ఏడాదిలోగానే ఉపసంహరించేస్తే నోట్ట రద్దు నిర్ణయం విఫలమన్న విమర్శలకు బలం చేకూర్చినట్లు అవుతుందని కేంద్రం భావిస్తోంది.

మరోపక్క 2000 రద్దుపై కేబినెట్లో గానీ, వేరే స్థాయిలో గానీ చర్చే జరగలేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు.ఏది ఏమైనా సరే మళ్ళీ పెద్ద నోట్ల రద్దు అంశం తెరమీదకి వచ్చి రద్దు కనుకా జరిగితే మోడీ తన కాళ్ళ కింద గొయ్యి తవ్వుకున్నట్టే అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube