తెల్ల జుట్టుకు హెయిర్ డై కాకుండా సహజసిద్ధమైన పదార్ధాలతో రంగులు వేస్తె...నల్లని జుట్టు మీ సొంతం  

Homemade Natural Dyes To Colour Grey Hair-

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటం సాధారణం అయ్యిపోయింది.మారిపోయిన జీవనశైలి,హార్మోన్ల ప్రభావం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు తెల్లగా మారుతుంది.

చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారటం వలన వయస్సు ఎక్కువ వారీగా కనపడతారు.దాంతో తెల్లజుట్టు నల్లగా కనపడటానికి హెయిర్ డై వేస్తూ ఉంటారు.

-

ఆ హెయిర్ డై కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.అందువల్ల తెల్లజుట్టును నల్లగా మార్చటానికి సహజసిద్ధమైన రంగులను చూద్దాం.

హెన్నా

మొదట తెల్లజుట్టుకు రంగు వేయాలంటే గుర్తుకు వచ్చేది హెన్నా.హెన్నాలో పొడి ఆముదంలో వేసి మరిగించాలి.ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుంచి మొత్తం జుట్టుకు పట్టించాలి.రెండు గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.

కాఫీ పొడి

ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి.ఈ మిశ్రమం చల్లారాక వడకట్టి ఒక స్ప్రై బోటిల్ లో పోసి జుట్టు మరియు కుదుళ్ళ మీద స్ప్రై చేసి కొంచెం సేపు మర్దన చేసి తలకు కవర్ చుట్టాలి.

రెండు గంటల తర్వాత జుట్టును కడిగితే నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

బ్లాక్ టీఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల బ్లాక్ టీ పొడి వేసి బాగా మరిగించి వడకట్టి చల్లారాక తలకు బాగా పట్టించి రెండు గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.

వాల్ నట్స్వాల్ నట్స్ కూడా తెల్లజుట్టు నల్లగా మారటానికి ఉపయోగించవచ్చు.వాల్ నట్లను నలిపి అరగంట సేపు నీటిలో మరిగించాలి.ఇది చల్లారిన తర్వాత కాటన్ బాల్ సాయంతో జుట్టుకు, కుదుళ్లకు పట్టించాలి.ఓ గంట సేపు ఆగి జుట్టును కడిగేసుకోవాలి.

తాజా వార్తలు