2019లో టికెట్స్ కోల్పోనున్న మంత్రుల లిస్టు ఇదే

అంతుబట్టని వ్యూహాలు వేయడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అనడంలో సందేహం లేదు.పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరు చూడటం లేదు అనుకుంటుంది అన్నట్టుగా.

 Ministers List Who Aren’t Getting 2019 Tickets-TeluguStop.com

ఏపీలో మంత్రులు,ఎమ్మెల్యేలు తీరు ఉంది.దానికి నిదర్సనంగా చంద్రబాబు సర్వేలు ఉన్నాయట.

ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటూ.సర్వేకి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ.

ఉండే చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.దానికి కారణం ఆ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ ప్రజలలో వ్యతిరేకత మూటకట్టుకోవడమే.

అంతేకాదు ఇన్‌చార్జ్‌ల‌కు ఇప్ప‌టికే టిక్కెట్ రాద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

అయితే ప్రస్తుతం చంద్రబాబు సేనియర్స్ కి పెద్ద షాక్ ఇస్తున్నాడట.

ఏమిటంటే వయసుమళ్ళిన వారిని పక్కకి తప్పించి యువకులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కొందరు మంత్రులకి కూడా టికెట్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్న టాక్ వినపడుతోంది.

కొందరికి టికెట్స్ ఇవ్వకపోవడం.మరికొందరికి నియోజకవర్గాల మార్పు ఇలాంటి పరిణామాలు జరగనున్నాయి అని తెలుస్తోంది.

టికెట్స్ రానివారిలో ముందు పేరు ఆళ్లగడ్డ ఆడబిడ్డ భుమా అఖిలప్రియ పేరు వినిపిస్తోంది.నంద్యాల నుంచి భూమా రైట్ హ్యాండ్ ఏవి.సుబ్బారెడ్డిని రంగంలోకి దించి, అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుంచి బ‌రిలోకి దింపుతార‌ని తెలుస్తోంది.సోమిరెడ్డి వరుసగా నాలుగు సార్లు గెలవలేకపోయారు .అయితే ఎమ్మెల్సీ కోటాలో ఆయనకీ మంత్రి పదవి కట్టబెట్టారు .ఈసారి మాత్రం ఆయనకీ ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తే పెద్ద తప్పు చేసినట్టుగా భావిస్తున్నారట.ఆయ‌న్ను తిరిగి ఎమ్మెల్సీగానే కంటిన్యూ చేయాల‌ని బాబు భావిస్తున్నారు.మరొక మంత్రి ఎమ్మెల్సీ నారాయణ కూడా ఎమ్మెల్సీ ద్వారా వచ్చారు.ఆయనకీ టికెట్ ఇస్తే గెలవడం సాధ్యం కాదనే వాదన వినిపించడంతో.ఆయనకి కూడా ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

మంత్రి దేవినేని ఉమకి ఇప్పుడున్న మైలవరం కాకుండా జిల్లాలోనే మరొక చోట ఇస్తారని తెలుస్తోంది.చంద్రబాబు సర్వేలో ఉమ మీద మైలవరంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఘంటా పరిస్థితి కూడా ఇదే .మరొక నియోజకవర్గానికి ఘంటా ని పంపనున్నారట.

పరిటాల ఫ్యామిలీ నుంచీ శ్రీరాం కి.సునీత ఇద్దరికీ టికెట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇంకా చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసిన వాళ్ళలో మాజీ మంత్రులు అయిన పీత‌ల సుజాత‌, రావెల కిషోర్‌బాబు, కిమిడి మృణాళిని, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డిలు ఉన్నారు…మరి ఈ ఈక్వేషన్లు ఎన్నికల వేళ చేంజ్ అవుతాయా లేదా అనేది చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube