పసుపు పొడిలో ఉన్న ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

పసుపును చికిత్సలోనే కాకుండా అందం ఉత్పత్తులు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు.భారతదేశంలో పసుపును దాదాపుగా అన్ని రకాల గ్రేవీ వంటలలోను ఉపయోగిస్తారు.

 What Are Advantages And Disadvantages Of Turmeric Details, Turmeric, Turmeric Pr-TeluguStop.com

ఇది ఆహారానికి మంచి రంగు మరియు మంచి రుచిని ఇస్తుంది.పసుపు ఒక ప్రసిద్ధ సంరక్షణకారిని అని చెప్పవచ్చు.

గుజరాత్ శాస్త్రవేత్తలు పనీర్ (కాటేజ్ చీజ్) కి పసుపును జోడించడం ద్వారా పనీర్ 12 రోజులు నిల్వ ఉండటాన్ని కనుగొన్నారు.పసుపును ఒక గొప్ప క్రిమిసంహారిణి అని చెప్పవచ్చు.

ఇంటి చుట్టూ పసుపు పొడిని చల్లితే కీటకాలు, చీమలు, చెద పురుగుల బాధ ఉండదు.భారతదేశంలో మహిళలు క్రీమ్స్ మరియు స్క్రబ్స్ వంటి చర్మ ఉత్పత్తులలో పసుపును ఉపయోగిస్తారు.

భారతదేశ వివాహాలలో పసుపుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది.వివాహానికి ముందు పసుపు ఉత్సవంలో భాగంగా వధువు మరియు వరుడుకి పసుపు పేస్ట్ ని రాస్తారు.

ఈ విధంగా రాయటం వలన చర్మం ప్రకాశ వంతంగా మారుతుందని మరియు చెడు దృష్టి ఉండదని నమ్మకం.పసుపును స్వచ్ఛత, శ్రేయస్సు మరియు సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు.

హిందూ మత ఆగమ సంబంధ వ్యవహారాల్లో భాగంగా ఆలయాల్లో దేవుళ్ల మీద పసుపు నీటితో అభిషేకం చేస్తారు.

భారతదేశంలో పసుపును పవిత్రమైన మరయు శుభప్రదమైనదిగా  భావిస్తారు.అలాగే పసుపు రంగు బట్టలను స్వచ్ఛమైనవిగా భావిస్తారు.నాలుగు కప్పుల నీటిలో ఒక స్పూన్ పసుపును వేసి మరిగించి, ఒక స్పూన్ తేనే కలిపి త్రాగితే జీవిత కాలం పెరుగుతుంది.

పసుపు యొక్క దుష్ప్రభావాలు

పసుపును సురక్షితంగా మరియు దుష్ప్రభావాలు లేకుండా వాడుకోవచ్చు.పసుపు సున్నితత్వం కారణంగా కొంత మందికి కడుపు అప్సెట్ లేదా అతిసారం రావచ్చు.గర్భవతిగా ఉన్న సమయంలో పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపు పిత్తాశయంలో సమస్యలను కలిగించవచ్చు.పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మది చేయవచ్చు.ఈ కారణం వలన శస్త్రచికిత్స తర్వాత అదనపు రక్తస్రావం కావచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube