రావి ఉసిరితో ఎన్నో ప్రయోజనాలు

ఉసిరి కాయ దీనిని రావి ఉసిరి అని కూడా అంటారు.ఇవి అడవులలో సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా పండుతాయి.

 There Are Many Benefits To Using Ravi Usiri , Ravi , Usiri, Grapefruit Juice-TeluguStop.com

వీటిని మన పూర్వీకులు ఎప్పటినుంచో ఆయుర్వేద మందులా వాడుతున్నారు.ఆయుర్వేదంలో ఉసిరికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ,ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్న సౌందర్య సాధనాల మీద లేక జుట్టుకి సంభందిత ఉత్పత్తులమీద ఈ ఉసిరి తప్పనిసరిగా ఉంటుంది.

ఈ ఉసిరి వలన అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేమిటో మీరు కూడా చూసి పాటించండి.

ఉసిరి పెచ్చుల పొడి,పిల్లపీచర గడ్డాల పొడి ,పంచదార ,తేనె వీటన్నిటినీ సమాన భాగాలుగా కలిపి నెయ్యి లేదా పాలు తో కలిపి తీసుకుంటే వృద్ధాప్యం లో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.కంటి చూపు మెరుగు పడుతుంది.

ఉసిరి పండ్ల రసాన్ని ద్రాక్ష పండ్ల రసాన్ని ,పంచదార కలిపి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది.అంతేకాదు ఉసిరి రసాన్ని నీళ్ళలో కలిపి మూడు రోజులు తీసుకోవడం వలన కూడా ఈ కడుపు నొప్పిని తగ్గించవచ్చు.

ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గటంతోపాటు రక్తస్రావం, మంటలు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

ఉసిరి పొడికి ,వేపాకు పొడిని కలిపి ప్రతీరోజు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలికంగా ఉండే చర్మ వ్యాధులు సైతం తగ్గిపోతాయి.

అలాగే ఉసిరి రసాన్ని 150 మిల్లి లీటర్ల మోతాదుని తేనెతో కలిపి తీసుకుంటే మూత్ర సంభందిత వ్యాదులు తొలగిపోతాయి.తెల్ల మచ్చలు తగ్గడానికి ఉసిరి పెచ్చులు ,చండ్ర చెక్కలని నీళ్ళకి కలిపి కషాయం చేసి బావంచాలు గింజల పొడిని తీసుకుంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి.

ఉసిరిపండ్ల పెచ్చులను, ఇప్పపువ్వులను (మధూకం) నీళ్లకు కలిపి మరిగించి, తేనె కలిపి బాగా పుక్కిట పడితే నోటిలోనూ, గొంతులోనూ తయారైన పూత, నోటి పుండ్లు తగ్గుతాయి లేత ఉసిరి కాయల్ని ,గోమూత్రంలో వారం పాటు నానబెట్టి,మేకపాలు కలిపి మెత్తని పేస్టూ లా నూరుకొని మొఖం మీద అద్దుకుంటే మంగు మచ్చలు తగ్గుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube