ఈ కషాయంతో జుట్టు అసలు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

జుట్టు రాలుతుందంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఆందోళనకు గురి అవుతారు.అయితే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి.

 How To Control Hair Fall In Telugu-TeluguStop.com

అలాగే జుట్టు రాలకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

పోషకాహారలోపం, హార్మోన్ల అసమతౌల్యత, థైరాయిడ్‌ వంటి కారణాలతో జుట్టు రాలిపోతుంది.జుట్టు రాలడానికి చెక్ పెట్టాలంటే వీటిని ఫాలో అవ్వాలి.

నిమ్మరసాన్ని నీటిలో కలిపి తలకు రాసి అరగంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.

ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, రెండు స్పూన్ల టీ పొడి వేసి మరిగించాలి.

నీటిని వడకట్టి ఆ నీటిలో షాంపూ కలిపి తలస్నానము చేస్తే జుట్టు రాలటం తగ్గటమే కాకుండా జుట్టు పట్టులా మారుతుంది.

మెంతులను పెరుగులో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానము చేయాలి.ఈ విధంగా చేయటం వలన జుట్టు రాలటం మరియు జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

ఒక కప్పు నీటిలో వేపాకులను వేసి బాగా మరిగించాలి.ఆ నీటిని వడకట్టి తలకు రాసుకొని అరగంట అయ్యాక తలస్నానము చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.

హెర్బల్ డికాషన్

పావులీటరు నీటిలో ఐదు మందార పువ్వులు, గుప్పెడు మందార ఆకులు, నాలుగు చుక్కల నీలగిరి తైలం, గుప్పెడు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి.ఆ నీటిని వడకట్టి తలకు రాసుకొని అరగంట అయ్యాక తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube