ఈ ఆహారాలను తీసుకుంటే గ్యాస్ సమస్య నిమిషాల్లో తగ్గిపోతుంది

ఈ రోజుల్లో గ్యాస్ సమస్య లేని వారు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు.ఎందుకంటే మారిన జీవనశైలి, ఉరుకు పరుకుల జీవితం,ఒత్తిడి,సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి కారణాలతో సమయానికి ఆహారం తీసుకోకపోవటం వలన గ్యాస్ సమస్య వస్తుంది.

 Home Remedies For Gastric Problem1-TeluguStop.com

ఈ సమస్యను తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అల్లం:

అల్లం గ్యాస్ సమస్యను నివారించటమే కాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరగటానికి సహాయపడుతుంది.అల్లంను టీ రూపంలో తీసుకోవచ్చు.లేదా అల్లం రసంగా చేసుకొని కూడా తీసుకోవచ్చు.

దాల్చినచెక్క:

దాల్చిన చెక్కతో యాంటిఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుట వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.దాల్చిన చెక్క పొడిని కాఫీ లేదా సలాడ్స్ లో జల్లుకుంటే సరిపోతుంది.

అనాస:

అనాస లో బ్రొమైలిన్ అనే ఎంజైమ్ ఉండుట వలన కొవ్వును విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియలో సహాయపడుట వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.

మంచి నీరు:

మంచి నీటిని ఎక్కువగా త్రాగటం వలన శరీరంలో మలినాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది.అంతేకాక ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయటం వలన గ్యాస్ సమస్య తగ్గుతుంది.అందువలన మంచి నీటిని ఎక్కువగా త్రాగటం అలవాటు చేసుకోవాలి.

నట్స్:

నట్స్ లో నియాసిన్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణవ్యవస్థను యాక్టివ్ ఉంచుతుంది.దాంతో గ్యాస్ సమస్య తగ్గుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉండుట వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అందువలన ప్రతి రోజు పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగితే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube