గడపకి పసుపు రాయడం వెనుక గల కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా ఒక ఊరిలో జనాభా గురించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎన్ని గడపలు వున్నాయనే ప్రస్తావన రావడం మనం తరచుగా చూస్తూనే వుంటాం.అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం తెలియజేస్తుంది.

 Why Is Turmeric Applied On The Main Door, Turmeric , Main Door, Devotioanl , Lak-TeluguStop.com

మన పూర్వీకులు భూమికి … ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు.భూమికి … ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై కూర్చుని హిరణ్య కశిపుడిని నరసింహస్వామి సంహరించిన విషయం కూడా మనకు తెలిసిందే.

గడప శ్రీ మహాలక్ష్మీ స్థానం … అందుకనే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం మనకు అనాదిగా ఆచారంగా వస్తోంది.

ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లో ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగాని జరగదు.

గడపను అమ్మవారి స్థానంగ భావిస్తోన్న కారణంగానే గడపను తొక్కడాన్ని .డపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు.గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే … రెండవది ప్రాణరక్షణ అని చెప్ప వచ్చు.<సాధారణంగా పల్లెటూళ్లు పంటపొలాల మధ్యలోనో .అడవులకు సమీపంలోనో ఉంటూ వుంటాయి.ఈ కారణంగా ఇళ్లలోకి పాములు … తేళ్లు వంటి విష జంతువులు వస్తూ వుంటాయి.

ఇవి పసుపు ఘాటును భరించలేవు కనుక ఆ దరిదాపుల్లోకి రాలేవు.అందువల్లనే గడపలకి పసుపు రాయడం ఆనవాయతీగా వచ్చిందని అంటుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube