స్ట్రెచ్ మార్క్ లను సహజంగా తొలగించటానికి పరిష్కార మార్గాలు

స్ట్రెచ్ మార్కులు ఎక్కువగా పొత్తికడుపు ప్రాంతంలో వస్తాయి.అలాగే చేతుల పై బాగం, ఛాతీ, లోపలి తొడలు ,హిప్స్ వంటి ప్రాంతాల్లో కూడా వస్తాయి.అయితే వీటిని సహజసిద్దంగా తొలగించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.

 Stretch Marks, How To Remove Stretch Marks, Stretch Marks Tips, Stretch Marks Re-TeluguStop.com

1.గుడ్డు తెల్లసొన మరియు ఆలివ్ నూనె


స్ట్రెచ్ మార్కులను తగ్గించటానికి గుడ్డు తెల్లసొన మరియు ఆలివ్ నూనెతో ఒక ఇంటి నివారణ ఉంది.గుడ్డు తెల్లసొనలో ఉండే వివిధ రకాల ప్రోటీన్స్, కొల్లాజెన్ మరియు విటమిన్ ఎ చర్మానికి బాగా సహాయపడతాయి.ఆలివ్ నూనెలో సమృద్దిగా ఉండే విటమిన్ E, యాంటి ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి మరియు చర్మాన్ని తేమగా ఉంచటానికి సహాయపడతాయి.

కావలసినవి


గుడ్డు తెల్లసొన
ఆలివ్ ఆయిల్

పద్దతి


మొదట స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రాంతంలో గుడ్డు తెల్లసొనను రాయాలి.ఇది బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ ని రాయాలి.ఇది స్ట్రెచ్ మార్కుల రంగును తగ్గించటానికి మరియు తేమగా ఉంచటానికి సహాయపడుతుంది.

2.ఇంటిలో తయారుచేసుకొనే క్రీమ్


ఈ క్రీమ్ లో ఉపయోగించే పదార్దాలు అన్ని యాంటి ఏజింగ్ కు వ్యతిరేకంగా మరియు చర్మంలో తేమ ఉండటానికి సహాయపడతాయి.

Telugu Remove Stretch, Stretch, Stretch Tips-

కావలసినవి


కోకో బటర్ – పావుకప్పు
బాదం నూనె – 2 స్పూన్స్
ఆలివ్ నూనె – 2 స్పూన్స్
నిమ్మ రసం – 1 స్పూన్
విటమిన్ E క్యాప్సిల్స్ – 5
తేనె – 1 స్పూన్
బయో నూనె – 1 స్పూన్
ఎస్సెన్షియాల్ ఆయిల్ – కొన్ని చుక్కలు

పద్దతి


ఒక గిన్నెలో కోకో బటర్,బాదం నూనె ,ఆలివ్ నూనె,నిమ్మ రసం ,విటమిన్ E క్యాప్సిల్స్,తేనె,బయో నూనె, ఎస్సెన్షియాల్ ఆయిల్ లను వేసి బాగా కలిసేలా కలపాలి.ఈ మిశ్రమాన్ని కదపకుండా రెండు గంటలు ఉంచాలి.ఈ మిశ్రమాన్ని రోజులో మూడు సార్లు ప్రభావిత ప్రాంతంలో రాయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube