దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ రివ్యూ

బ్యాన‌ర్‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
టైటిల్‌: దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్
జాన‌ర్‌: రొమాంటిక్‌, యాక్ష‌న్ డ్రామా
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, రావూ ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: చోటా కె.ప్ర‌సాద్‌
ఫైట్స్‌: రామ్ – లక్ష్మ‌ణ్‌
నిర్మాత‌: దిల్ రాజు
ద‌ర్శ‌క‌త్వం: హ‌రీశ్ శంక‌ర్‌.ఎస్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్‌: 23 జూన్‌, 2017

 Duvvada Jagannadham Movie Review-TeluguStop.com

నాలుగు వ‌రుస రూ.50 కోట్ల సినిమాల‌తో టాలీవుడ్‌లో కొత్త రికార్డు త‌న పేరిట క్రియేట్ చేసుకున్న స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జ‌గ‌న్నాథం (డీజే).బ‌న్నీ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో బ‌న్నీ ఓ బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా న‌టించ‌నున్నాడు.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కిన 25వ సినిమా కావ‌డంతో పాటు గ‌బ్బ‌ర్‌సింగ్‌తో పాటు ప‌లు హిట్ చిత్రాలు త‌న‌దైన స్టైల్లో తెర‌కెక్కించిన హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో డీజేపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

డీజే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు యూట్యూబ్‌లో వ‌చ్చిన రెస్పాన్సే ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను చెపుతోంది.రూ.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన డీజే ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.మ‌రి డీజే ఎలా ఉందో ఈ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
విజ‌య‌వాడ‌లోని ఆగ్ర‌హారంలో అన్న‌పూర్ణ క్యాట‌రింగ్ న‌డుపుతూ ఉంటాడు తనికెళ్ల భ‌ర‌ణి.త‌నికెళ్ల కుమారుడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అలియాస్ శాస్త్రి (అల్లు అర్జున్‌).

వెన్నెల కిషోర్ పెళ్లిలో హీరోయిన్ పూజా హెగ్డేను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు.ఆమె ముందు శాస్త్రి ప్రేమ‌ను తిర‌స్కరిస్తుంది.

పూజా తండ్రి అయిన హోం మినిస్ట‌ర్ (పోసాని) ఆమెకు రొయ్య‌ల నాయుడు (రావూ ర‌మేష్‌) కొడుకు సుబ్బ‌రాజుతో పెళ్లి చేయాల‌నుకుంటాడు.సుబ్బరాజుతో మీట్ అయిన పూజా అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌తో షాక్ అయ్యి చివ‌ర‌కు శాస్త్రినే చేసుకోవాల‌ని ఫిక్స్ అవుతుంది.

ఈ స్టోరీ ఇలా ఉంటే స‌మాజంలో జ‌రిగే అన్యాయాల‌పై చిన్న‌ప్ప‌టి నుంచి పోలీస్ ఆఫీస‌ర్ ముర‌ళీశ‌ర్మ‌తో క‌లిసి ఫైట్ చేస్తుంటాడు డీజే.ముర‌ళీశ‌ర్మ బ‌న్నీ క‌లిసి సీక్రెట్ ఆప‌రేష‌న్ ద్వారా అన్యాయాలు చేసే వాళ్ల‌ను చంపేస్తుంటారు
అగ్రి డైమండ్ కంపెనీ ప్రజలను మోసం చేసి వారి నుంచి 9 వేల కోట్లు దోచుకుంటుంది.

ఈ విష‌యం తెలుసుకున్న డీజే ఈ కుంభ‌కోణం వెన‌క ఉన్న రొయ్య‌ల నాయుడును టార్గెట్ చేస్తాడు.నాయుడిని చంపేందుకు డీజే వేసిన ప్లాన్ ఏంటి ? అస‌లు డీజేకు – దువ్వాడ జ‌గ‌న్నాథంకు ఉన్న లింక్ ఏంటి ? మ‌రి శాస్త్రి – పూజ ఒక్క‌ట‌య్యారా ? అన్న‌దే ఈ సినిమా.

విశ్లేష‌ణ :

డీజే విశ్లేష‌ణ చూస్తే అల్లు అర్జున్ ఇటు శాస్త్రి క్యారెక్ట‌ర్‌లోను, ఇటు డీజేగాను మెప్పించాడు.స్టోరీ అంతా పాత‌దే, క‌థ‌నం, సీన్లు పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డే అయినా హీరో క్యారెక్ట‌ర్‌ను మాత్రం కాస్త కొత్త‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు.

ఫ‌స్టాఫ్ సినిమా కాస్త ఎంట‌ర్‌టైనింగ్‌గాను, స్పీడ్‌గాను బోర్‌లేకుండా ఉంటుంది.సెకండాఫ్ ఆస‌క్తి లేకుండా ముందుకు వెళుతుంది.ఇక్క‌డ కామెడీ కూడా స‌రిగా స్కోప్ లేకుండా చేసేశాడు హ‌రీశ్‌.క్లైమాక్స్ కామెడీ ట‌చ్‌తో డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేయ‌డం బాగుంది.

పాత క‌థే తీసుకున్నా డైరెక్ష‌న్ ప‌రంగా కాస్త మ్యాజిక్ చేసి ప్రేక్ష‌కులు సీట్ల‌లో ఉండేలా చేయ‌డంలో మాత్రం కొంత‌వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

బ‌న్నీ బ్రాహ్మ‌ణుడు అయిన శాస్త్రి పాత్రోను, అటు డీజే క్యారెక్ట‌ర్‌లోను యాక్ష‌న్‌తో దుమ్మురేపాడు.శాస్త్రిగా లుక్స్ వ‌ర‌కు ఓకే అనిపించిన బ‌న్నీ ఆ క్యారెక్ట‌ర్‌లో డైలాగ్స్ విష‌యంలో కొన్ని సార్లు అద్భుతంగా ప‌లికినా కొన్నిచోట్ల కాస్త ఓవ‌ర్ అనిపించాడు.ఇక హీరోయిన్ పూజా హెగ్డేకు సినిమాలో న‌ట‌న కంటే అందాల ఆర‌బోత‌లోనే మంచి స్కోప్ ఉంది.

పూజా త‌న క్యూట్ లుక్స్‌తోను, గ్లామ‌ర్ పెర్పామెన్స్‌తోను యూత్‌కు కిక్ ఇచ్చింది.ఇక బికీనీలో ఆమె అందాల ఆర‌బోత అబ్బో చెప్ప‌డం కంటే చూడ‌డం బెట‌ర్‌.సినిమాలో దాదాపు అన్ని సీన్ల‌లోను పూజ తొడ‌ల‌కు కాస్త పైనే డ్రెస్ ఉంది.ఇక రొయ్య‌ల‌నాయుడు క్యారెక్ట‌ర్‌లో చేసిన రావూ ర‌మేష్‌కు త‌న‌కు అల‌వాటైన రీతిలోనే న‌టించాడు.

ఇక పోలీస్ రైట‌ర్ క్యారెక్టర్‌లో ముర‌ళీకృష్ణ‌, బ‌న్నీ తండ్రిగా త‌నికెళ్ల భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రులు సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో మెప్పించారు.వెన్నెల కిషోర్ కామెడీ సీన్లు బాగున్నాయి.

సుబ్బ‌రాజు చ‌నిపోయిన అమ్మ‌తో మాట్లాడే అమాయ‌క‌పు క్యారెక్ట‌ర్‌లో మెప్పించాడు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ :

టెక్నిక‌ల్‌గా అయాంక‌బోస్ సినిమాటోగ్ర‌ఫీకి మంచి మార్కులు వేయాలి.సినిమా అంతా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాడు.ప్రతీ ప్రేమ్ నిండుగా ఉంది.ఇక దేవిశ్రీ సంగీతంలో పాటలు విన‌డానికి, చూడ‌డానికి బాగున్నా ఆర్ ఆర్ విష‌యంలో అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే మెరుపులు క‌నిపించాయి.చోటా కె.నాయుడు ఎడిటింగ్ మ‌రి కాస్త ట్రిమ్ చేయాల్సింది.చాలా సీన్ల‌లో సాగ‌దీత క‌న‌ప‌డింది.

అగ్ర‌హారం సెట్లు, కేటిరింగ్ సీన్లలో ర‌వీంద్ర ఆర్ట్ వ‌ర్క్ ప‌నిత‌న క‌న‌ప‌డింది.యాక్ష‌న్ సీన్లు ఇంకా కొత్త‌గా డిజైన్ చేసే ఛాన్సులు ఉన్నాయి.

దిల్ రాజు రాజీ ప‌డ‌కుండా డీజేకు ఖ‌ర్చు చేసిన విష‌యం ప్ర‌తి సీన్‌లోను మ‌న‌కు క‌న‌పిస్తుంది

ఇక ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ పాత క‌థ‌కు, పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి క‌థ‌నాన్ని జోడీంచి డీజే తీసేశాడు.అయితే కమ‌ర్షియ‌ల్ ట్రాక్ మిస్ కాకుండా చూసుకోవ‌డం డీజేకు క‌లిసొచ్చింది.

సినిమాలో క‌థ‌, క‌థ‌నాలు మ‌న‌కు తెలిసిన‌వే.ఉత్కంఠ ఉండ‌దు.

ట్విస్టులు కూడా గొప్ప‌గా లేవు.కామెడీ, పూజ‌, బ‌న్నీ మ‌ధ్య ల‌వ్ సీన్లు, డిఫ‌రెంట్ క్లైమాక్స్‌తో బండి లాగించేశాడు.

ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన కంపెనీల ప‌ని ప‌ట్ట‌డం లాంటి అంశాల‌తో తెలుగులో చాలా సినిమాలే వ‌చ్చాయి.డీజే కూడా అంతే.

డీజే, శాస్త్రి లాంటి క్యారెక్ట‌ర్లు మిన‌హా కొత్త‌గా ఏం ఉండ‌దు.అలా అని మరీ బోర్ లేకుండా సినిమాను ఏదోలా గ‌ట్టెక్కించేశాడు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– బ‌న్నీ – పూజ మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్‌
– పూజ అందాల ఆర‌బోత‌, బికినీ సీన్‌
– సాంగ్స్‌
– సినిమాటోగ్ర‌ఫీ
– నిర్మాణ విలువ‌లు
– పంచ్ డైలాగ్స్‌

మైన‌స్ పాయింట్స్ (-) :

– రొటీన్ క‌థ‌
– ఎంగేజింగ్‌గా లేని స్క్రీన్ ప్లే
– పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి సీన్లు
– ప్లాట్ న‌రేష‌న్‌

ఫైన‌ల్ పంచ్‌:

రొటీన్‌గా దంచేసిన డీజే

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ రేటింగ్ : 2.75 / 5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube