తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారో తెలుసా?

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1.పూలు 2.అక్షింతలు, 3.ఫలాలు,4,అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు.కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసే సమయంలో తమలపాకుని ఉపయోగిస్తారు.పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు.పసుపు గణపతినీ,గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.భారత దేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు.

 The Significance Of Thamboolam Betel Leafs-TeluguStop.com

భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు.దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

స్కాంద పురాణం ప్రకారం క్షీర సాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి.కొన్ని జానపద కధల ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని ప్రతీతి.

తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని మన పెద్దలు చెబుతాతమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

తమలపాకు మధ్యభాగంలో సరస్వతీదేవి ఉంటుంది.

తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన జ్యేష్టా దేవి ఉంటుంది.

తమలపాకులో విష్ణుమూర్తి ఉంటాడు.

తమలపాకు పైభాగంలో శివుడు, కామదేవుడు ఉంటారు.

తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

తమలపాకుకి కుడి భాగంలో భూమాత ఉంటుంది.

సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube