కాకతీయ రాజుల కళా వైభవాలకి ప్రతీక ఓరుగల్లు

ఓరుగల్లు పేరు వినగానే మనకి కాకతీయ కాలం నాటి శిల్ప కళా వైభవాలు గుర్తొస్తాయి.కాకతీయులు వరంగల్ చుట్టూ పక్కల ఎన్నో రకాలైన కట్టడాలను నిర్మించారు.

 Most Ancient Places In Warangal Kakatiya Dynasty1-TeluguStop.com

అలనాడు కట్టిన కాకతీయ చారిత్రక కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి.వాటిలో వరంగల్ కోట , వేయి స్తంభాల గుడి,రామప్ప దేవాలయాలు ప్రముఖమైనవి.

వేయి స్తంభాల గుడి:

వేయి స్తంభాల గుడి వరంగల్ జిల్లా హన్మకొండ లో ఉంది.తెలంగాణ రాష్ట్రం లోనే కాదు దేశంలోనే ప్రసిద్ధి పొందిన కట్టడం.

ఈ గుడి ప్రాచీన వైభవాన్ని , అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చెదిరి పోకుండా ఉంది.ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే తెలియని ఒక అనుభూతి కలుగుతుంది.

సోపానాలు మాదిరి ఉండే మెట్లు గోడలు అద్భుతంగా ఉంటాయి.ఇది చాలా పురాతనమైన దేవాలయం.

వేయి స్తంభాల గుడిని 12 వ శతాబ్దం లో కాకతీయ రాజు రుద్ర దేవుడు నిర్మించాడు.ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితమైనదే కాదు ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది అదేంటంటే ఇక్కడ ఉండే స్తంభాల పై నాణాలతో గాని ఏదైనా ఇనుము లోహం తో గాని తాకిస్తే సప్త స్వరాలు , మధురమైన సంగీతం వినిపిస్తుంది.ఈ ఆలయం లో ఎటు వైపు చూసిన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి , వరంగల్ వెళ్తే తప్పకుండా సందర్శించే ప్రదేశం ఇది.

వరంగల్ ఖిల్లా:

వరంగల్ ఖిల్లా ఆ కాలం లో ఓరుగల్లు కోటగా వ్యవహరించబడేది.దక్షిణ భారత దేశంలో శిల్ప కలకి మంచి ఉదాహరణ ఈ కోట.ఓరుగల్లు కోటను 13 వ శతాబ్దం లో నిర్మించారు.ఇప్పుడు ఈ కోట శితిలవాస్తలో ఉంది.ఆ రోజుల్లో ఈ కోట నిర్మాణాన్ని కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు ప్రారంభించగా ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి పూర్తి చేశారు.

ఈ కోటాని మొత్తం మూడు ప్రాకారాలతో నిర్మించారు.ఈ కోట వరంగల్ యొక్క రైల్వే స్టేషన్ నుండి రెండు కిలో మీటర్ల దూరం లో ఉంటుంది.

రామప్ప దేవాలయం:

ఓరుగల్లు ని చాలా మంది రాజులు పరి పాలించారు అందులో కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం ఈ రామప్ప దేవాలయం.ఈ ప్రదేశం వరంగల్ కి 70 కిలోమీటర్ల దూరం లో ఉన్న పాలంపేట అనే ఊరి దగ్గర్లో ఉంది.

రామప్ప దేవాలయాన్ని రామ లింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా చెప్పుకోవచ్చు.ఈ దేవాలయం చాలా తేలికైన ఇటుకల తో నిర్మించారు.ఈ ఇటుకలు నీటి మీద తేలేంత తెలికైనవి అని చెప్తారు.

ఈ ఆలయం ముందు ఒక నంది ఉంటుంది , ఆ నందికి ఒక ప్రత్యేకత ఉంది ఆలయం లో ఎటు వైపు నుండి చూసిన అది మనలని చేసినట్లే ఉంటుంది.ఈ ఆలయం వరంగల్ లో అతి ప్రాచీరమైన మరియు ప్రాముఖ్యమైన దేవాలయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube