కాలకేయ ప్రభాకర్ కి మహేష్ చేసిన సహాయం చూస్తే సెల్యూట్ చేస్తారు

కాలకేయ ప్రభాకర్ ఇప్పుడు ఇండియా మొత్తం ఫేమస్.ప్రత్యేకంగా ప్రభాకర్ అంటే జనాలు గుర్తుపట్టొచ్చు, పట్టకపోవచ్చు కాని, బాహుబలి విలన్ అనగానే కిలికిలి భాషలో అబ్బురపరిచిన ప్రభాకర్ గుర్తుకువస్తాడు.

 Mahesh Babu Is My Guru Says Baahubali Villain-TeluguStop.com

ఇదంతా ప్రస్తుతం కాని ఒకప్పుడు ప్రభాకర్ గుర్తింపు కోసం చాలా కష్టపడ్డారు.సినిమాల్లో వేషం కోసం సంవత్సరాలు తిరిగారు.

అలాంటి సమయంలో మహేష్ బాబు చేసిన ఒక సహాయం ఎప్పటికి మర్చిపోలేనని, మహేష్ బాబు తన గురువు అని ప్రభాకర్ చెబుతున్నారు ప్రభాకర్.అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా ?

అవి అతిథి సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు.అప్పుడు ఒక ఫైట్ సీన్ తీస్తున్నారు.ఏదైనా చిన్న వేషం కోసం అక్కడ వేయిట్ చేస్తున్న ప్రభాకర్ ని చూసిన డైరక్షన్ డిపార్టుమెంటు వారు ఆయన్ని లోపటికి రమ్మని విలన్ గ్యాంగ్ లో పెట్టారు.

అది కూడా అంతమందిలో ఎక్కడో చివర్లో.సినిమాల్లో ఫైట్ చూసేటప్పుడు హీరో పది పదిహేనుమందిని కొడతాడు.మనం వారిని గుర్తుపెట్టుకుంటామా? అలాంటి సీన్ లో ప్రభాకర్ ని చివరి వరుసలో నిలబెట్టారు.అదృష్టం ఏమిటంటే మహేష్ కన్ను ఎత్తుగా ఉన్న ప్రభాకర్ మీద పడింది.

ఒకసారి ఇటు రావయ్యా అంటూ పిలిచి పేరు, అవి ఇవి అడిగాడట.ఆ తరువాత ఉహించని కబురు చెబుతూ, ఈ సీన్ లో నువ్వు వెనక కాదు ఉండాల్సింది, ముందు ఉండాలి అంటూ గ్యాంగ్ లో మెయిన్ వేషం ఇప్పించాడు మహేష్.

కాని ప్రభాకర్ ని హావాభావాలు పలకించడం రావట్లేదు.సీన్ కుదరట్లేదు.

ఆ సమయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు?

మహేష్ ప్రభాకర్ ని తిట్టలేదు.వేరే అతడ్ని పెట్టండయ్యా అంటూ సీన్ లోంచి తీసెయ్యలేదు.

ప్రభాకర్ ఉండాల్సిందే అంటూ ఆ రోజుకి షూటింగ్ క్యాన్సిల్ చేయించి, సాయంత్రం అక్కడే ఉండమని, తాను స్వయంగా వచ్చి, ప్రభాకర్ తో దగ్గరుండి సీన్ ప్రాక్టీస్ చేయించాడట.మరుసటిరోజు ప్రభాకర్ మీదే సీన్ తీసారు.

ఒక సూపర్ స్టార్ ఒక మామూలు వ్యక్తి కోసం (ఆ సమయంలో) అంత చేయడమంటే మాటలు కాదు.ఆ తీపిగుర్తులని నేమరువేసుకున్న ప్రభాకర్, ఇటివలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube