ఉద్యోగం కోసం వెతుకుతున్నారా ? ఉద్యోగాలు ఫుల్ అభ్యర్థులు నిల్  

Nil Applications For Jobs In Kiwis-

ప్రపంచం లో చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉంటున్నారు.ఇంకా కొన్ని దేశాలలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రభుత్వం పైన వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.

చాలా దేశాలు నిరుద్యోగ సమస్యని ఎదుర్కొంటున్నారు.అయితే ఒక దేశం లో మాత్రం ఉద్యోగాలు ఇస్తాం జీతాలు ఎంత కావాలంటే అంత ఇస్తాం అని ప్రభుత్వమే ప్రజలని వేడుకుంటుంది.

-

విషయానికి వస్తే న్యూజీలాండ్ లోని ఒక చిన్న పట్టణం లో కావాల్సినన్ని ఉద్యోగాలు , ఇల్లులు ఉన్నపటికీ వాటిలో నివసించేందుకు జనాభా తగినంత మంది లేకపోవడం విశేషం.దీంతో ఉద్యోగులు కావాలంటూ అక్కడి ప్రభుత్వం ప్రజలని బతిమిలాడుతుంది

న్యూజీలాండ్ లోని క్లూతా జిల్లాలో ఉన్న కైటంగట అనే పట్టణం లో సుమారు 800 మంది ఉంటున్నారు.

ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి.కానీ ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు లేక ప్రభుత్వం వ్యాపారులు ఉద్యోగార్థుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించింది.

అంతే కాదు అభ్యర్థులకు వ్యాపారులకు కళ్ళు చెదిరే బంపర్ ఆఫర్ లని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.ఉద్యోగం లో చేరే వారికి అధిక మొత్తం లో వేతనాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

దీని పైన క్లూతా జిల్లా మేయర్ బ్రియన్ కెడోజెన్ మాట్లాడుతూ పట్టణం లో 1,000 ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని తెలిపారు.

తాజా వార్తలు