మూత్రపిండాల-కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

మూత్రపిండాలు(కిడ్నీ)లో రాళ్ళూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది.ఆ నొప్పిని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది.

 Kidney Stones Causes And Care Tips Diet High In Salt Or Sugar , A Diet High Salt-TeluguStop.com

మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి.సాదారణంగా ఈ రాళ్లు అనేవి కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ మరియు యూరిక్ ఆమ్లం వలన ఏర్పడతాయి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని మరియు 20 నుంచి 40 సంవత్సరాల లపు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింది.

సాధారణంగా చిన్న రాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి.

అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గములో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు.అంతేకాక పెద్ద రాళ్ళ కారణంగా మూత్ర మార్గము కూడా దెబ్బతింటుంది.

1.తగినంత నీటిని త్రాగాలి తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగటమే కాకుండా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

తగినంత నీటిని తీసుకోవటం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు పంపుతాయి.

Telugu Diet Salt Sugar, Calcium Diet, Plenty, Kidney-Telugu Health Tips

2.కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలి మనం తీసుకొనే ఆహారంలో కాల్షియం తక్కువైతే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అయిన అక్సలేట్ స్థాయిలు పెరిగిపోతాయి.ఆహారంలో తగినంత కాల్షియం తీసుకుంటే, మూత్రపిండాలకు వెళ్ళకుండా మరియు రక్తంలో కలవకుండా అక్సలేట్ ను ప్రేగుల్లో బందిస్తుంది.

3.అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

శరీరంలో కాల్షియం శోషణ తగ్గి అది కాల్షియం అక్సలేట్ గా మారి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడుతుంది.

Telugu Diet Salt Sugar, Calcium Diet, Plenty, Kidney-Telugu Health Tips

4.ఉప్పు తీసుకోవటం తగ్గించాలి సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మూత్రంలో కాల్షియం కంటెంట్ పెరుగుతుంది.తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి మద్దతు కలుగుతుంది.

అంతేకాక మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది.శరీరంలో అదనపు సోడియంను బయటకు పంపటం మూత్రపిండాలకు కష్టమైన పనిగా మారుతుంది.

5.సోడా మరియు కార్బోనేటేడ్ పానీయాలు త్రాగకూడదు సోడా మరియు కార్బోనేటేడ్ పానీయాలకు మూత్రపిండాలలో రాళ్ళకు సంబంధం ఉంది.కార్బోనేటేడ్ పానీయాలలో ఉండే ఫాస్ఫారిక్ ఆమ్లం రాళ్లుగా మారుతుంది.ఇటువంటి పానీయాలను త్రాగితే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube