మీరు మాట్లాడింది టైప్ చేసే కీబోర్డ్ .. ఇంకెన్నో అధ్బుతమైన ఆప్షన్స్

ఆ జమానాలో కంప్యుటర్ కంటే మొబైల్ వాడే వారే ఎక్కువ.ఒకప్పుడు అన్ని పనులకి కంప్యూటర్ దిక్కు.

 G-board New Updated Mobile Keyboard And It’s Features-TeluguStop.com

కాని ఇప్పుడు కంప్యూటర్ చేసే ఎన్నో పనులు మొబైల్ చేస్తోంది.జనాలు మెయిల్స్ మొబైల్ నుంచే పంపుతున్నారు.

ఏం రాయాలన్నా మొబైల్ తోనే రాస్తున్నారు.మరి అలాంటప్పుడు మంచి కీబోర్డు వాడితే పని సులభతరం అవుతుంది.

మీరు ఒక మెయిల్ రాస్తున్నారు అనుకోండి .సడెన్ గా ఎదో గూగుల్ లో వెతకాలి.మెయిల్ యాప్ క్లోజ్ చేయడం ఎంత ఇబ్బంది ? ఇలాంటి చిన్ని చిన్ని అవసరాలు కొన్ని ఉంటాయి.అందుకు గూగుల్ తన “G-Board” మొబైల్ కీబోర్డుని కొన్ని అధునాతనమైన మార్పులు చేసి తీసుకొచ్చింది.

మీర్ ఈ కీబోర్డు వాడితే, మీ మొబైల్ లో మరో కీబోర్డు ఇన్స్టాల్ చేసుకోరు.దీని స్పెషాలిటీస్ ఏమిటో చూడండి

* ఇందులో చిన్న స్పీకర్ ఆప్షన్ ఉంటుంది.

అది ఆన్ చేసి మీరు ఇంగ్లిష్ లో మాట్లాడితే, ఆ వాక్యాలు ఆటోమేటిక్ గా టైప్ అయిపోతాయి

* మీరు ఒక వాక్యాన్ని ఎక్కువగా వాడతారు అనుకోండి, దాన్ని ఈ కీబోర్డు గుర్తు పెట్టుకుంటుంది.ఉదాహరణకి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ సీతతో చాట్ చేసేటప్పుడు ఎక్కువగా ‘Sita you look great in this dress” అని వాడుతున్నారు అనుకోండి.

దాన్ని కీబోర్డు గుర్తు పెట్టుకొని మీరు Sita అని టైప్ చేయగానే మిగితా పదాలను పైన సజెస్ట్ చేస్తుంది.సో, మీరు ఎక్కువగా వాడే వాక్యాలను టైప్ చేయాలంటే పెద్దగా కష్టపాడాల్సిన అవసరం లేదు.

* మీరు ఇందాక చెప్పినట్టుగా ఎదో మెయిల్ మొబైల్ లో టైప్ చేస్తున్నారు.ఇంతలో గూగుల్ లో ఎదో వెతకాల్సిన పని పడింది .మీరు యాప్ క్లోజ్ చేసి బ్రౌజర్ దాకా వెళ్ళాల్సిన పని లేదు.అక్కడే గూగుల్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి.

అందులో సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది.అక్కడే కీబోర్డులోనే చిన్నిపాటి బ్రౌజింగ్ చేసుకోవచ్చు

* ఇదే కీబోర్డులో గూగుల్ ట్రాన్స్ లెటర్ ని కూడా ఇచ్చేసింది గూగుల్.

అంటే మీకు సడెన్ గా ఇంగ్లిష్ లో ఏదైనా పదానికి అర్థం కావాలి అనుకోండి, అక్కడే కీ బోర్డు ఉన్న ట్రాన్స్ లెటర్ వాడి అర్థాలు తెలుసుకోవచ్చు.ఇలా తెలుగు నుంచి ఇంగ్లిష్ కి, హిందీ నుంచి తెలుగు కి .రకరకాల కాంబినేషన్ లో ట్రాన్స్ లెటర్ ని వాడుకోవచ్చు

* ఇదంతా ఎమోజిల కాలం.సోషల్ మీడియా వాడుతున్నామంటే ఎమోజిలు ఖచ్చితంగా వాడాల్సిందే.

చాటింగ్ అయినా, పోస్టింగ్ అయినా.జీబోర్డు లో ఎమోజిల కలెక్షన్ చాలా పెద్దగా ఉంది

* దీన్ని వన్ హ్యాండ్ మోడ్ లో వాడుకోవచ్చు.

థీమ్ లాగా మీ సొంత ఫోటోలు పెట్టుకోవచ్చు.స్లైడ్ టైపింగ్ కూడా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube