సినిమా పోస్టర్ మీద రకుల్, మంచు లక్ష్మీ నిప్పులు

అపుడెప్పుడో వచ్చిన వచ్చిన డైరెక్టర్ వంశీ లేడీస్ టైలర్ సినిమా గుర్తిందిగా? రాజేంద్రప్రసాద్ నటించిన ఈ చిత్రం ఆకాలం ప్రేక్షకులని విపరీతంగా అలరించింది.ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోందన్న సంగతి తెలిసిందే.

 Rakul Preet And Manchu Laxmi Objects “adult” Poster-TeluguStop.com

ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ అనే పేరుతో వస్తున్న ఈ రెండొవ భాగంలో, కథంతా లేడీస్ టైలర్ సుందరం కొడుకు చుట్టూ నడుస్తుందట.ఈ సినిమా ఫస్ట్ లుక్ ని నిర్మాత మధుర శ్రీధర్ నిన్న విడుదల చేసారు.

ఎంతమందికి ఈ పోస్టర్ నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అనే విషయాన్ని పక్కనపెడితే, నెగేటివ్ గానో, పాజిటివ్ గానో, జనాలు సినిమా గురించి, ఆ పోస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు.అందుకు కారణం, ఆ పోస్టర్ లో హీరో ఎవరో అమ్మాయి ఛాతి సైజుని కొలుస్తూ ఉండటమే.

ఇప్పుడు ఈ స్టిల్ మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ మనోభావాలని దెబ్బతీసిందట.

పోస్టర్ గురించి మాట్లాడుతూ “మహిళలని ఈరకంగా చూపించడం ఎప్పుడు మానేస్తారో” అంటూ మంచు లక్ష్మీ కామెంట్ చేస్తే, మంచువారితో జతకలిసిన రకుల్, దీని వలన సమాజంలోకి వెళ్ళే సందేశం ఏమిటి అని ప్రశ్నించింది.

ఇదంతా నిన్న ట్విట్టర్లో జరిగింది.ఇక్కడ వీరు పోస్టర్ మీద నిప్పులు చెరిగినందుకు చప్పట్లు కొట్టారేమో ట్విట్టర్ జనాలు అని అనుకుంటే అది పొరపాటే .రివర్స్ గా చివాట్లు పడ్డాయి.

తన నిర్మాణంలో వచ్చే సినిమాల్లో హీరోయిన్స్ తో బాగా ఎక్స్ పోజింగ్ మంచు లక్ష్మీ, ఈమధ్యే ధృవలో పరేషానురా అంటూ అంగాంగ ప్రదర్శన చేసిన రకుల్ ప్రీత్ ఇలాంటి నీతులు చెప్పడం ఏమిటి ? మోడల్ గా ఉన్న రోజుల్లో బికినిలు ధరించినప్పుడు రకుల్ సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చింది? హీరోయిన్స్ ముందు స్కిన్ షో ఆపి, ఇలాంటి వాటి మీద మాట్లాడాలి అంటూ క్లాస్ పీకింది ట్విట్టర్ జనాభా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube