బీజేపీని న‌మ్ముకుంటే టీటీడీపీకే నష్ట‌మా

బీజేపీని టీటీడీపీ త‌క్కువ‌గా అంచ‌నా వేస్తోందా? త‌మ అండ లేక‌పోతే నెగ్గుకురావ‌డం క‌ష్ట‌మ‌ని, బీజేపీ ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌డం క‌ష్ట‌మని భావిస్తోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.ఒక‌ప‌క్క బీజేపీ ఎప్పుడెప్పుడు టీడీపీతో విడిపోయి.

 Is Ttdp Bonds With Bjp In Telangana..?-TeluguStop.com

సొంతంగా ఎదుగుదామా అని ఆలోచిస్తోంది, మ‌రోపక్క విడిపోతే బీజేపీకి అంత స‌త్తా లేద‌ని, తాము లేక‌పోతే ఇక బీజేపీ ఎద‌గడం క‌ష్ట‌మ‌ని అతి విశ్వాసంతో ఉంది.అయితే ఇలా బీజేపీని త‌క్క‌వుగా అంచ‌నా వేస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! టీఆర్ఎస్‌తో దోస్తీ క‌డితే ఇక టీటీడీపీ గ‌తి ఏమ‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

దేశంలో మారుతున్న రాజ‌కీయ ముఖ‌చిత్రం నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం భాజ‌పాకి త‌గ్గుతోంది.సోలోగా ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటోంది.

ఇదే ట్రెండ్ లో ఈ మ‌ధ్య తెలంగాణ‌పై కూడా అమిత్ షా ప్ర‌త్యేక దృష్టి పెడుతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.కాస్త బ‌లంగా ప్ర‌య‌త్నిస్తే తెలంగాణ‌లో భాజ‌పా ప‌ట్టు సాధించే ప‌రిస్థితులు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న‌ది వారి అంచ‌నా.అయితే, ఈ క్ర‌మంలో తెలుగుదేశంతో పొత్తు గురించి ఏం చేద్దాం అనే చ‌ర్చ మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.2014 ఎన్నిక‌ల్లో టీడీపీ చిటికెన వేలు ప‌ట్టుకుని తెలంగాణ‌లో ఓ ఐదు స్థానాల‌ను భాజ‌పా ద‌క్కించుకుంది.ఆ త‌రువాత‌, కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా రాష్ట్ర భాజ‌పా నేత‌లు నిలిచారు.

రాష్ట్రంలో భాజ‌పా విస్త‌ర‌ణ‌కు ఇదే మంచి అద‌నుగా భాజ‌పా భావిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలుగుదేశంతో త‌లాక్ చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.ఇదే త‌రుణంలో కేసీఆర్ వైఫ‌ల్యాల‌పై ఉద్య‌మిం చేందుకు కూడా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తోంది.

ముస్లింల రిజ‌ర్వేష‌న్ల అంశ‌మై ఛ‌లో అసెంబ్లీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతోంది.ఈ ప‌రిణామాలు తెలుగుదేశంలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యంలో టీడీపీ ధీమా వేరుగా ఉంద‌ట‌.తెలంగాణ‌లో భాజ‌పా బ‌లంగా కొన్ని చోట్ల ఉన్న‌ట్టు అనిపిస్తున్నా… సొంతంగా ఎన్నిక‌ల్లో గెలిచేంత స్థాయి బ‌లం ప్ర‌స్తుతానికి లేద‌ని టీటీడీపీ భావిస్తోంద‌ట‌.

నిజానికి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ ప్రాంతాల్లో ముస్లింల జ‌నాభా బ‌లంగా ఉంది.ఈ ప్రాంతాల్లో భాజ‌పాకి కాస్త మంచి వేవ్ ఉంది.

కానీ, ఏదో ఒక పార్టీ అండ లేకుండా భాజ‌పా సొంతంగా ముందుకు సాగే ప‌రిస్థితి అక్క‌డ లేదు.టీడీపీ ధీమా కూడా ఇదే.ఇది టీడీపీకి ఇబ్బందిక‌ర‌మే.ఎందుకంటే, భాజ‌పాతో వీలైతే అధికారిక పొత్తు కుదుర్చుకునేందుకు తెరాస వేచి చూస్తోంద‌న్న విష‌యం మ‌ర‌చిపోకూడ‌దు.

భాజపా వైపు నుంచి ఆలోచించినా.తెలంగాణ‌లో భాజ‌పాకి టీడీపీ కంటే తెరాస బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షం అవుతుంది క‌దా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube