ఏపీ కేబినెట్‌లో ఆ మంత్రికి ఈ మంత్రి ఎస‌రు

మంత్రి వర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఇద్ద‌రు మంత్రులు ఒక‌రి వెనకాల మ‌రొక‌రు గోతులు త‌వ్వుకుంటున్నారు.తాను చేసిన త‌ప్పులు చాలా త‌క్కువ‌ని.

 Ministers Fighting For Ap Cabinet Post-TeluguStop.com

త‌న‌కంటే ఇంకో మంత్రి ఎక్కువ త‌ప్పులు చేశార‌ని స‌న్నిహిత వ‌ర్గాలతో అంటున్నార‌ట‌.అలాంటప్పుడు ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌కుండా.

త‌న‌నే ఎందుకు ల‌క్ష్యం చేసుకుంటున్నార‌ని లాజిక‌ల్‌గా ప్ర‌శ్న‌లు వేస్తున్నార‌ట‌.ఇవ‌న్నీ విన్న పార్టీ నేత‌లు అవాక్క‌వుతున్నార‌ని తెలుస్తోంది.

ఇంకో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.ఈ ఇద్ద‌రు మంత్రులూ ఒకే జిల్లాకు చెందిన వారు కావ‌డం విశేషం! వారెవరంటే.

రావెల కిషోర్‌బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావు!!

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి పోయే వారి జాబితాలో బ‌లంగా వినిపిస్తున్న పేరు రావెల కిషోర్‌బాబు!! ఆయ‌న ప‌నితీరు, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌పై చంద్ర‌బాబుకు గ‌ల అభిప్రాయం ఇవ‌న్నీ క‌ల‌గ‌లసి.మంత్రి ప‌ద‌వి నుంచి ఆయ‌న్ను దూరం చేస్తున్నాయి.

అయితే ఈ విషయంపై పార్టీ నాయకుల వద్ద రావెల‌ చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.తనవైపున ఏదైనా తప్పు జరిగింది అంటే పార్టీకి కొత్త కాబట్టి నాయకులతో కొన్ని సమస్యలు వచ్చాయని అదే పత్తిపాటి పుల్లారావు విషయంలో ప్రతికూల అంశాలు ఎన్నో ఉన్నాయని అంటున్నార‌ట‌.

అన్ని ప్రతికూల అంశాలు ఉన్న పుల్లారావును వదిలేసి.తనను ఒక్కడినే ఎలా టార్గెట్ చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబ సభ్యలు ఎవరూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటంలేదని.అదే వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు కుటుంబ సభ్యులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని.భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని రావెల‌ పార్టీ నాయకుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.తన శాఖపై పెద్దగా అవినీతి ఆరోపణలు ఏమీ లేవని.

అదే పుల్లారావు సారథ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖకు సంబంధించి నకిలీ విత్తనాలు మొదలుకుని పలు అక్రమాలు జరిగాయని చెబుతున్నారు.పుల్లారావు చేసే సెటిల్ మెంట్లు జిల్లా అంతటా పెద్ద దుమారం రేపుతున్నాయనేది ఆయన వాదన.

పుల్లారావు రాజధాని భూముల వ్యవహారాల్లో గోల్ మాల్ చేయటంతో పాటు…చిలకూరిపేట ప్రాంతంలో మైనింగ్ కోసం దళితులు.అసైన్ మెంట్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనికి తోడు మంత్రి పదవి పొందటానికి తాము భారీ ఎత్తున డబ్బు ఇఛ్చామని….ఆరోపణల పేరుతో తమను ఎలా తీసేస్తారని.

తీసేస్తే ఊరుకుంటామా? అని పుల్లారావు భార్య పార్టీ నాయకుల వద్ద గ‌ట్టిగానే వ్యాఖ్యానించారట‌.ఇన్ని అంశాలు ఉన్న పుల్లారావును కాదని.

తన ఒక్కడిపై వేటు ఎలా వేస్తారని రావెళ్ల కిషోర్ బాబు ప్రశ్నిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube