దువ్వాడ జగన్నాథం డిస్‌లైక్స్ గోలతో బాగా హర్ట్ అయిన స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు యంగ్ హీరో రామ్ దెబ్బకు కూడా బాగా హర్ట్ అయినట్టు ఇండస్ట్రీ ఇన్నర్ టాక్.మరి బన్నీకి బాధ కలిగించే అంత పని రామ్ ఏం చేశాడో చూద్దాం.
ఓ యంగ్ డైరెక్టర్ ఇటీవల బన్నీని కలిసి ఓ కథ చెప్పాడట.ఆ కథ చాలా ఉత్కంఠతో మలుపులు మలుపులతో ఉందట.
బన్నీకి ఆ కథ కిక్ ఇచ్చినా సినిమా మాత్రం చేయలేనని చెప్పాడట.
వెంటనే ఆ డైరెక్టర్ రామ్‌ను కలిసి ఆ కథ చెబితే చేస్తానని వెంటనే ఓకే చెప్పేశాడట.
మళ్లీ ఏమనుకున్నాడో ఏమో గానీ.ఆ డైరెక్టర్‌కు బన్నీ తిరిగి ఫోన్ చేశాడని, సినిమా చేద్దామని చెప్పాడట.
అయితే ఆ డైరెక్టర్ సారీ సర్.రామ్ ఆ కథకు ఓకే చెప్పేశాడు.
ఆయనతోనే ఆ సినిమా చేస్తున్నానని చెప్పేశాడట.
దీంతో తాను అనవసరంగా ఆ స్టోరీని వదులుకున్నానని బన్నీ తెగ ఫీలవుతున్నాడట.
రామ్ గ్రీన్ సిగ్నల్‌తో బన్నీ ఓ మంచి కథను మిస్సయ్యాడని అనుకుంటున్నారట సినీ జనాలు.ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తోన్న బన్నీ ఆ తర్వాత లింగుస్వామికి కమిట్ అయినా ఆ సినిమా క్యాన్సిల్ అయినట్టు సమాచారం.