శ‌శిక‌ళ‌కు స్టాలిన్‌ షాక్‌: ప‌న్నీర్‌కు మ‌ద్ద‌తు

త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న రాజ‌కీయాలు ఎటు వైపు దారి తీస్తాయోన‌ని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ వ‌ర్గమా? లేక ప‌న్నీర్ వ‌ర్గ‌మా? అనేది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.అన్నాడీఎంకేలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నింటినీ ప్ర‌తిప‌క్ష నేత స్టాలిన్ నిశితంగా ప‌రిశీలిస్తూ.అందుకు అనుగుణంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు.మ‌రి ఇప్పుడు అమ్మ న‌మ్మిన బంటు, మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వానికి పరోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి.స్టాలిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.ప‌న్నీరు సెల్వాన్ని తిరిగి సీఎంని చేస్తే స్టాలిన్‌కు ఏంటి లాభం? ఇది స్టాలిన్ ప‌క్కా వ్యూహ‌మా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

 Shock To Sasikala-TeluguStop.com

‘ఉంటే, గింటే పన్నీర్‌ సెల్వమే సీఎంగా ఉండాలికానీ, శశికళను ప్రజలు స్వీకరించరు` అని ప్ర‌తిప‌క్ష నేత‌ స్టాలిన్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు త‌మిళ‌నాట చ‌ర్చ‌నీయాంశ‌మైంది.తద్వారా అడగకనే పన్నీర్‌కు తన మద్దతు ప్రకటించారు.శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని స్టాలిన్ ప్రకటించిన విష‌యం తెలిసిందే! మ‌రి ఈ విష‌యంలో ప‌న్నీర్ సెల్వానికి స్టాలిన్ మ‌ద్ద‌తు ఇస్తే.శ‌శిక‌ళ వ‌ర్గానికి ఇది గ‌ట్టి షాకే అనడంలో ఎటువంటి సందేహం లేదు!

ఈ స‌మ‌యంలో శాస‌న సభలో బలనిరూపణ కీలక అంశంగా మారింది.235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది.ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి 8, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.సీఎం కావాలంటే కనీసం 117మంది మద్దతు అవసరం.

ప్రస్తుతం ప‌న్నీర్ సెల్వానికి 62 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

అయితే ఇప్పుడు డీఎంకేపై పన్నీర్ సెల్వం ఆశ‌లు పెట్టుకున్నారు!

పన్నీర్‌ సెల్వంను ముఖ్యమంత్రిని చేసేందుకు డీఎంకే మద్దతు పలికితే గనుక అది ఆ పార్టీకి ఆత్మహత్యాసదుశ్యమే అనేది ముఖ్యుల అభిప్రాయం! అయినా వాటిని ఖాత‌రు చేయ‌కుండా స్టాలిన్‌ ధైర్యం చేస్తారా? అంటే స్పష్టమైన సమాధానం చెప్పలేం.అన్నాడీఎంకే చీలిక వర్గానికి తాత్కాలిక మద్దతు పలకడంద్వారా వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తేగనుక పన్నీర్‌కు స్టాలిన్‌ మద్దతు పలకొచ్చు! మ‌రి ఈ విష‌యంలో స్టాలిన్ వ్యూహం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో వేచిచూద్దాం!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube