తనలాంటి నకిలీ వ్యక్తితో నాగబాబు పరేషాన్

ట్విట్టర్ కి అడవికి తేడా ఉండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.ఎక్కడలేని వింత మనషులు ఇక్కడే కనిపిస్తారు.

 Naga Babu Facing Serious Troubles With His Fake Twitter Account-TeluguStop.com

అందుకే సినిమా యాక్టర్లకి ట్విట్టర్ అంటే కొంచెం భయం.తమ మీద నకిలీ అకౌంట్లు క్రియేట్ అవవచ్చు, తమ ట్వీట్ కి ఎవరైనా అసభ్యంగా బదులు ఇవ్వవచ్చు, ఒక్కోసారి తమ అకౌంట్ ని హ్యాక్ కూడా చేయవచ్చు.ఇన్ని ప్రమాదాల నడుమ, కొంతమంది జాగ్రత్తగా ఉంటారు, తమ పని తాము చేసుకుంటూ మిగితా విషయాలను పట్టించుకోరు.పట్టించుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాగబాబు గారిని చూస్తే అర్థం అవుతుంది.

నాగబాబు ఇటివలే తనకోసం ట్విట్టర్ ఖాతా తెరచుకున్నారు.వచ్చీరాగానే పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు పోస్ట్ చేస్తూ పోయారు.

ట్విట్టర్ లో అందరిని, ముఖ్యంగా మెగా ఫ్యామిలిని ఆడుకునే రామ్ గోపాల్ వర్మతో ఈయన ఆడుకుంటాడు అని మెగా ఫ్యాన్స్ ఆశపడితే, నాగబాబుతో ఒక నకిలీ వ్యక్తి కబాడి ఆడుకుంటున్నాడు.

విషయం ఏమిటంటే, నాగబాబు పేరుతో మరో నకిలి ప్రొఫైల్ క్రియేట్ చేసారు ఎవరో! విచిత్రమైన విషయం ఏమింటంటే, ఆ నకిలి వ్యక్తి ఒరిజినల్ నాగబాబుని నువ్వు ఎవరు అని అడుగుతున్నాడు.

ఆయన పేరుని వాడుకుంటూ మిగితావారిని అనరాని మాటలంటున్నాడు.కాసేపు తట్టుకున్నా, అసలు నాగబాబు ఓపిక నశించింది.

మొదట ఆ నకిలి వ్యక్తిని బూతులు తిట్టారు (నిజంగానే బూతులు వాడారు).చివరకి బాధపడ్డారు.

తన ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడానికి ట్విట్టర్ కి వస్తే, నాకు ఇక్కడ ఇలాంటి మనుషులు ఎదురయ్యారని గోడు చెప్పుకున్నారు.

అంతే కాదు, నాగబాబు మీద ఇతర ఫ్యాన్స్, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ బాగా జోకులేస్తున్నారు.

పాపం కదా … అయినా, ఇవన్ని పట్టించుకోని బాధపడితే ఎలా! ట్విట్టర్ అంతే, అడవి లాంటి ప్రాంతం సెలబ్రిటిలకి.చేతిలో కీబోర్డు ఉంటే, ఎవరైనా, ఎదైనా రాసేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube