బాబు ఇంట్లోనే టీడీపీకి దెబ్బ ప‌డుతోందా..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఇలాకా అయిన ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులో టీడీపీని సొంత పార్టీ నేత‌లే దెబ్బేస్తున్నార‌నే చర్చ ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.జిల్లాలో సీనియ‌ర్లు జూనియ‌ర్లు, కొత్త, పాత నాయ‌కులు ఎవ‌రికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ పార్టీలో గ్రూపుల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌డంతో పార్టీ రోజు రోజుకు తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌న్న టాక్ వినిపిస్తోంది.

 Internal Fights In Tdp-TeluguStop.com

2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సీఎం అయినా చిత్తూరు జిల్లాలో మాత్రం వైసీపీ పూర్తిగా డామినేట్ చేసింది.ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ స‌త్తా చాటాల‌ని చంద్ర‌బాబు తీవ్రంగా కృషి చేస్తుంటే సొంత పార్టీ నాయ‌కులే త‌మ‌లో తాము ఆధిప‌త్యం కోసం నిత్యం క‌ల‌హించుకోవ‌డం పార్టీకి పెద్ద మైన‌స్‌గా మారింది.

జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తిలో మునిసిప‌ల్ చైర్మ‌న్‌కు వైస్ చైర్మ‌న్‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు.

ఇక్క‌డ రెండు గ్రూపులు ఉన్నాయి.మంత్రి దీనిని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.

సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఇన్‌చార్జ్‌గా ఉన్న న‌గ‌రిలో గాలిని సీనియ‌ర్ నాయ‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు.నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మార్కెట్ క‌మిటీలు ఉన్నా వాటి నియామ‌కాలు జ‌రిగేలా గాలి చేయ‌క‌పోవ‌డంతో అక్క‌డ అసంతృప్తి భ‌గ్గుమంటోంది.

పలమనేరు నియోజకవర్గంలో పాత నాయకుడు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మళ్లీ పార్టీలోకి వ‌చ్చారు.ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన ఇన్‌చార్జ్ రాయ‌ల సుభాష్ చంద్ర‌బోస్‌కు అమ‌ర‌నాథ్‌రెడ్డికి పొస‌గ‌డం లేదు.

పూత‌ల‌ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు గ్రూపుల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌లేక ల‌లిత‌కుమారి చేతులెత్తేశారు.

స‌త్య‌వేడులో ఎమ్మెల్యే, ఆయ‌న తండ్రి ఓ వ‌ర్గంగాను, పార్టీ శ్రేణులు మ‌రోవ‌ర్గంగాను విడిపోయారు.

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నారాయ‌ణ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాల‌ను కూర్చోపెట్టి రాజీ చేసినా అది మూడునాళ్ల ముచ్చ‌టే అయ్యింది.ఇక పార్టీ ఓడిపోయిన మదనపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో పార్టీ మ‌రింత బ‌ల‌హీనంగా ఉంది.ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి ఎవ‌రికి వారు పార్టీని మ‌రింత బ‌ల‌హీన‌ప‌రుస్తున్నార‌ట‌.2019 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ పార్టీ త‌ర‌పున నిల‌బ‌డై స్ట్రాంగ్ అభ్య‌ర్థులు కూడా క‌నిపించ‌డం లేదు.

ఏదేమైనా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో విప‌క్ష వైసీపీ కంటే టీడీపీలోని గ్రూపు రాజ‌కీయాలే ఆ పార్టీకి దెబ్బేసేలా క‌నిపిస్తున్నాయి.మ‌రి చంద్ర‌బాబు సొంత జిల్లాపై ఎంతో స్పెష‌ల్ కాన్‌సంట్రేష‌న్ చేస్తేనే త‌ప్ప వీటికి తెర‌ప‌డేలా లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube