మీడియా నన్ను వదలదు అంటున్న సన్నీ లియోన్

భారత దేశంలో అత్యధిక శాతం గూగుల్ లో సెర్చ్ చేయబడే పేరు సన్నీ లియోన్.ఈ భామకి అంత క్రేజ్ ఉంది కాబట్టే, మీడియా చిన్న చిన్న విషయాలు కవర్ చేయడంతో పాటు, లేనిపోని గాసిప్పులు కూడా ప్రచారం చేస్తూ ఉంటుంది.

 Sunny Leone Feels That Media Won’t Stop Gossiping About Her-TeluguStop.com

రోజుకో కొత్త రూమర్ రావడం చాలా కామన్ విషయం.ఇలా మీడియా వేస్తున్న వేషాల్ని కొంతైనా తగ్గించాలాని, తన గురించి సరైన సమాచారం తానే ఇవ్వాలని నిర్ణయించుకుంది సన్నీ.

అందుకే సొంతంగా ఒక మొబైల్ యాప్ విడుదల చేసింది.

ఈ యాప్ లో సన్నీ లియోన్ తాజా చిత్రాల గురించి, షూటింగ్ ముచ్చట్ల గురించి ఎప్పటికప్పుడు సమాచారం పొందుపరుస్తూ ఉంటారు సన్నీ లియోన్ మరియు తన టీమ్.

అదే యాప్ కి తన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయట.

అభిమానులకి తన గురించి సమాచారం అందించడానికి ఇది మంచి మార్గమని, తన గురించి ప్రతి అప్డేట్ ఈ యాప్ లో తెలుసుకోవచ్చని సన్నీ చెప్పింది.

అయితే, ఇన్ని చేసినా, మీడియా తనని మాత్రం వదలదని, ఏవేవో రాస్తూనే ఉంటుందని సన్నీ చమత్కరించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube