ఎన్టీఆర్ ని అలా అనలేదు అంటున్న డైరెక్టర్

తమిళ డైరెక్టర్ హరి తెలుసుగా.ఈ మధ్య ఆయన ఇంటర్వ్యు అంటూ వచ్చిన ఒక ఫేక్ ఇంటర్వ్యు ఇంటర్నెట్ లో తెగ హల్చల్ చేసింది.

 Director Hari Clarifies On His Controversial Comments About Ntr-TeluguStop.com

దానికి కారణం పెద్దదే.ఆ ఇంటర్వ్యులో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో తనకి తెలిదు అని హరి అన్నట్లు ఉంది.

తమిళంలో అంత పేరున్న డైరెక్టర్ కి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తెలియకపోవడం ఏంటి అని అందరు మొదట ఆశ్చర్యపోయారు.కాని ఆ ఇంటర్వ్యు ఫేక్ అని హరి ఇచ్చిన తాజా స్టేట్మెంట్ లో తెలిసిపోయింది.

సింగం 3 ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ తో మాట్లాడిన హరికి, మొన్న ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు అన్ని అన్నారట, ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది.దానికి సమాధానమిచ్చిన హరి, ఆ రకంగా తను ఎప్పుడు అనలేదని, అలా ప్రచారం జరుగుతున్న విషయం కూడా తెలియదు, ఎన్టీఆర్ అంటే తనకి చాలా అభిమానం, టెంపర్ సినిమాని రెండుసార్లు చూసాను, ఎన్టీఆర్ ని నాలుగైదు సార్లు కలిసాను కూడా, ఆయనకి ఓ కథ కూడా వినిపించినా, ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు అని హరి వివరణ ఇచ్చారు.

ఇలా తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలని అవమానించినట్లు ఫేక్ వార్తలు రావడం కొత్తేమి కాదులేండి.ఆ మధ్య మహేష్ బాబు నటన మురుగదాస్ కి నచ్చట్లేదని ఇలాంటి గాలి వార్త ఒకటి బాగా ప్రచారాన్ని పొందింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube