సిగరెట్ అలవాటు మానిపించేసే ఉపాయం అంటున్నారు

బేసిక్ గా మన సంప్రదాయం మనకంటే ఇతరులకే బాగా నచ్చుతుందేమో.భారతదేశపు ప్రాచీన ఆస్తి అయిన యోగా -ధ్యానం ఇప్పుడు భారతదేశంలో కంటే, బయటి దేశాల్లోనే ఎక్కువ ప్రాచుర్యం పొందుతోంది అనేది కాదనలేని వాస్తవం.

 Yoga Can Really Kill The Want Of Smoking – Study-TeluguStop.com

స్టయిల్ విషయంలో హాలివుడ్ నటీనటులని ఫాలో అయ్యే మన యువత, వారి లైఫ్ స్టయిల్ ని కూడా కొంచెం ఫాలో అయితే బాగుండేదేమో.టాం హ్యాన్క్స్, జెన్నిఫర్ ఆనిస్ స్టన్, ఏమ్మా వాట్సన్,రాబర్ట్ డౌని ఇలాంటి ఫేమస్ హాలివుడ్ నటులంతా యోగా ప్రేమికులే.

ఇందులో ఏమ్మా వాట్సన్ ఒక యోగా టీచర్ కూడా అయితే, జేన్నిఫర్ ఆనిస్ స్టన్ యోగా సహాయంతో సిగరెట్ అలవాటుని మానేసింది.పొద్దున్నే ఇంత నీతిబోధ ఎందుకు అని అనుకుంటున్నారేమో .ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే….

బ్రహ్మకుమారి సెంటర్స్ వాళ్ళు సిగరెట్ తాగే అలవాటు ఉన్న ఓ వెయ్యిమందితో యోగా చేయించడం మొదలుపెట్టారట.

క్రమం తప్పకుండా రోజు యోగా, మెడిటేషన్ చేయడం అలవాటు చేసారు.యోగా – ధ్యానం సహాయంతో ఆ వెయ్యిమందిలో 620 మందికిపైగా సిగరెట్ అలవాటుని మానేసారట.ఇటివలే WHO అధ్వర్యంలో జరిగిన ఒక సదస్సులో ఈ రిసెర్చ్ యొక్క ఫలితాలు బయటకి చెప్పారు.

యోగా, మెడిటేషన్ దురలవాట్లను దూరం చేస్తాయి అని చెప్పడానికి, ఇదో చిన్న ఉదాహారణ మాత్రమే అని, సిగరెట్ బలహీనంగా మారిస్తే, యోగా, ధ్యానం చేయడం మొదలుపెట్టి, బలవంతులుగా ఎదగాలని సదస్సులో పాల్గొన్న వక్తలు చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube