తమన్నా అందాల మీదే భారమంతా

తమిళ హీరో విశాల్ ఎంత త్వరగా తెలుగులో ఓ మార్కేట్ ని క్రియేట్ చేసుకున్నాడో, అంతే త్వరగా పోగొట్టుకున్నాడు కూడా.పందెం కోడి తరువాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాడు విశాల్.

 Vishal Heavily Dependent On Tamanna’s Glamour This Time-TeluguStop.com

ఎన్ని అపజయాలు ఎదురైనా, తాను తమిళంలో చేసే ప్రతీ సినిమా తెలుగులోకి డబ్ చేస్తూనే ఉన్నాడు విశాల్.అదే పద్ధతిలో తన కొత్త చిత్రం కత్తి సండాయ్ ని తెలుగలోకి “ఒక్కడొచ్చాడు” అనే పేరుతో అనువాదం చేస్తున్నాడు విశాల్.

ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ బాగా ఉన్నాయట.అయితే తెలుగు ప్రేక్షకుల వరకు మాత్రం విశాల్ ఫైట్స్ కన్నా, తమన్నా అందాలే పెద్ద ఆకర్షణగా నిలువబోతున్నాయట.

మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవడం కోసం ఇందులో మిల్కీ బ్యూటితో బాగా స్కిన్ షో చేయించారంట.ఈ గ్లామర్ షో సినిమాకి మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టడం ఖాయమని ఆశిస్తోంది యూనిట్.

ఆరకంగా తమన్నా అందాలపైనే ఈసారి విశాల్ ఆశలన్ని పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో జగపతిబాబు, సంపత్ రాజ్ లాంటి నటులు ఉండటం కూడా తెలుగు వెర్షన్ కి పనికిరావొచ్చు.

సూరజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 18న విడుదల కాబోతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube