గర్భం దాల్చాలనుకుంటే ఈ అలవాట్లు మానెయ్యాలి

తల్లి కావాలని, కన్నబిడ్డతో అమ్మ అని పిలిపించుకోవాలని ఏ స్త్రీకి ఉండదు.ఎంత మోడ్రన్ ప్రపంచంలో బ్రతుకుతున్నా, గజిగజి మహానగరాల జీవితం గడుపుతున్నా, అమ్మ అంటే అమ్మే.

 These Habits Aren’t Safe For Pregnant Women-TeluguStop.com

కాని, తల్లి కావడం వరకే కాదు, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆరోగ్యకరమైన పాలు పట్టడంపై కూడా అలోచించాలి.బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

అంటే, తల్లినవ్వాలి అని నిర్ణయించుకున్న క్షణం నుంచే కొన్ని అలవాట్లు మానేయ్యాలి.

* ఇది అందరికి వర్తించే విషయం కాదని తెలుసు కాని, మద్యం అలవాటు ఉన్న స్త్రీలు మాత్రం వెంటనే మద్యం మానెయ్యాలి.

లేదంటే సహజ గర్భవిచ్చిత్తి లాంటి ఘోరమైన కండిషన్ ని చూడాల్సి రావొచ్చు.

* ఇది కూడా అందరికి వర్తించదు కాని, ధూమపానం కూడా పుట్టబోయే బిడ్డకి, తనలో ఏర్పడే ఊపిరితిత్తులకు మంచిది కాదు.

* వినడానికి కాస్త వింతగా ఉన్నా, గర్భం దాల్చబోయే స్త్రీలు కాఫీ మానెయ్యాలి.ఎందుకంటే అప్పుడే కెఫైన్ ని స్వీకరించే స్థితిలో బిడ్డ ఉండదు.

ఈ అలవాటు మిస్ క్యారేజ్ లేదా ప్రిమెచ్యూర్ బర్త్ కి దారి తీయొచ్చు.

* షుగర్‌ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఆహారం కూడా మానెయ్యాలి.

హై షుగర్ లెవెల్స్, తల్లి, బిడ్డ, ఇద్దరికీ మంచిది కాదు.

* కొన్ని అవసరాలకి ఇప్పటిదాకా వాడిన మెడిసిన్స్ గర్భం దాల్చే సమయంలో ప్రమాదకరం కావొచ్చు.

కాబట్టి ఏ మెడిసిన్ వాడాలనుకున్నా, డాక్టర్ ని సంప్రదించడం కంపల్సరి.

* అతిగా ఆలోచించడం, స్ట్రెస్ లోకి వెళ్ళిపోవడం లాంటివి ఉంటే వాటిని పక్కనపెట్టండి.

* వ్యాయామం చేసే అలవాటు ఉన్న స్త్రీలు అతిగా వ్యాయామం చేయడం మానెయ్యాలి.తేలికపాటి వ్యాయామం ఒకే.అది కూడా ఎలాంటి వ్యాయామం చేయాలో డాక్టర్ ని అడగి తెలుసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube