పిరియడ్స్ లో క్రాంప్స్ వస్తే ఈ ఆహారం వద్దు

పీరియడ్స్ లో క్రాంప్స్ తో ఇబ్బంది పడటం చాలామంది అమ్మాయిల విషయంలో జరిగే పనే.కాని కొంతమందికి దురదృష్టవశాత్తు ఈ నొప్పులు మరీ విపరీతంగా ఉంటాయి.

 Foods That One Should Avoid During Menstrual Cramps-TeluguStop.com

దాంతో రోజువారీ జీవితం దెబ్బతింటుంది.మూడ్ స్వింగ్ ఎక్కువైపోతుంది.

అలాంటప్పుడు నిప్పులో పెట్రోల్ పోయకూడదు.అంటే సమస్యలను పెంచే ఆహారం ముట్టుకోకూడదు.

ఆ ఆహారం ఏంటంటే …

* పీరియడ్స్ క్రాంప్స్ తో ఇబ్బందిపడుతున్నప్పుడు మద్యం అస్సలు ముట్టకపోవడమే మంచిది (ఒకవేళ అలవాటు ఉంటే).ఆల్కహాల్ లో ఉండే డియురెటిక్ అనే పదార్థం పీరియడ్ క్రాంప్స్ ని పెంచడమే కాదు, లోయర్ అబ్డామెన్ ఉబ్బేలా చేస్తుంది.

* కాఫీ ప్రియులు పీరియడ్ నొప్పులతో పోరాడుతున్నప్పుడైనా కాఫీని కాస్త పక్కనపెడితే మంచిది.ఇందులో ఉండే కెఫైన్ సమస్యని ఇంకా పెంచుతుందే తప్ప తగ్గించదు.

* రెగ్యులర్ గా చాకోలేట్ తినటం అమ్మాయిలకి అలవాటే.కాని చాకోలేట్ లో కూడా కెఫైన్ ఉంటుంది.

కాబట్టి కాఫీతో పాటు చాకోలేట్ ని కూడా సమస్య తగ్గేంతవరకు పక్కనపెట్టాలి.

* ఉప్పు ఎక్కువగా వాడే ఆహారం, ప్రాసేస్డ్ ఫుడ్స్, చిప్స్ లాంటివి కూడా ఇలాంటి సమయంలో ప్రమాదకరమే.

ఎందుకంటే ఇవి వాటర్ రిటెన్షన్ కి కారణమయ్యి నిప్పులను తీవ్రతరం చేస్తాయి.

* చెక్కెర తినమని పక్కింటి ఆంటి సలహా ఇస్తే వెంటనే మరో అలోచన లేకుండా అడుగేయ్యొద్దు.

నిజానికి అలాంటి సమయంలో చెక్కెర మంటకి కారణమవుతుంది.

* పాలు, యోగ్రట్, చీజ్, వెన్నలో ఆరకిడొనిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది.

ఇది పీరియడ్స్ లో క్రాంప్స్ ని మరింతగా పెంచుతుంది.

* రెడ్ మీట్ లో కూడా ఈ ఆరకిడొనిక్ ఆసిడ్ ఉంటుంది.

కాబట్టి అలాంటి ఆహారానికి కూడా దూరంగా ఉండాలి.

* అలాగే పచ్చళ్ళు, ఫ్రై చేసిన ఆహారపదార్థాలు, క్యాన్డ్ ఫుడ్స్ కూడా పిరియడ్ క్రాంప్స్ ని పెంచుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube