బివేర్ ఆఫ్ రాజ్ తరుణ్..!

అదేంటి టైటిల్ విచిత్రంగా ఉందే అని ఆశ్చర్యపోవచ్చు.యువ హీరోల్లో జోష్ ఉన్న రాజ్ తరుణ్ వరుస సక్సెస్ లతో హోరెత్తిస్తున్నాడు.

 Impresive Raj Tarun Movie First Look-TeluguStop.com

ఈడోరకం ఆడోరకం సినిమా తర్వాత రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా వంశీ కృష్ణ డైరక్షన్లో ఏకే ఎంటర్టైమెంట్స్ బ్యానర్లో ఓ సినిమా తెరకెక్కుతుంది.సినిమా టైటిల్ ఇంకా కన్ఫాం అవ్వలేదు కాని సినిమాలో రాజ్ దొంగగా కనిపిస్తాడట.

అలాంటిలాంటి చిల్లర దొంగ కాదు మనోడు కుక్కల దొంగట.ఇక ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ కుక్కల మధ్య రాజ్ తరుణ్ బి వేర్ ఆఫ్ కిట్టు అని పెట్టారు.

సాధారణంగా కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డ్ పెడతారు కాని ఆ కుక్కలను కూడా భయపెట్టే కిట్టు ఉన్నాడు జాగ్రత్త అని పోస్టర్ లో ఉంచారు.ఇక పోస్టర్ తోనే సినిమా ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు.

ఒకప్పుడు దొంగ అంటే విలన్ అనే స్థాయి నుండి హీరో కూడా దొంగ పాత్రలేసే పరిస్థితి తయారయ్యింది.త్వరలో టైటిల్ ఎనౌన్స్ చేయడమే కాకుండా ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

మరి బి వేర్ ఆఫ్ రాజ్ తరుణ్ అదేనండి కిట్టు చేసే అల్లరి పనులేంటో తెలియాలంటే సినిమా వచే దాకా ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube