ఐరన్ లెగ్ నయన్.. అందుకే ప్రమోషన్స్ కు రాదట..!

అదేంటి టాలీవుడ్ కోలీవుడ్ లో ఓ రేంజ్ పాపులారిటీతో పాటు హిట్ల మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతున్న నయనతారను పట్టుకుని ఐరన్ లెగ్ అని ముద్ర వేస్తారని మీరు కంగారు పడొచ్చు.అయితే అమెను ఐరన్ లెగ్ అంటుంది ఎవరో కాదు తనకు తానే ఐరన్ లెగ్ అనేసుకుంటుంది ఈ అమ్మడు.

 Nayanatara Opens Why She Won’t Came For Movie Promotions-TeluguStop.com

అదెలా అంటే సినిమాలకు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే నయన్ ఆ సినిమా ప్రమోషన్ అంటే చాలు హ్యాండ్ ఇచ్చేస్తుంది.ఇక దీని మీద మొన్నటిదాకా పెద్ద చర్చే జరిగిందనుకోండి.

అయితే తాను ప్రమోషన్స్ కు రాకపోడానికి గల కారణాలు చెప్పేసింది నయనతార.తను ఏ సినిమా ప్రమోషన్స్ కు వెళ్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అందుకే ఇక ప్రమోషన్స్ వెళ్లకూడదని డిసైడ్ అయ్యానని అంటుంది.

నయన్ చెప్పిన మాటలు చూస్తుంటే తప్పించుకునేందుకు అలా అన్నట్టున్నా ఇదవరకు నయన్ ప్రమోషన్స్ చేసిన సినిమాల ఫలితం చూస్తుంటే ఆమె చెప్పింది నిజమే అనిపిస్తుంది.సో సినిమాకు తీసి ఎంతో కొంత ప్రాఫిట్ పొందుదాం అనుకున్న నిర్మాత ఆశలను ఎందుకు నాశనం చేయడమని నయన్ ప్రమోషన్స్ అంటే సారీ అనేస్తుందట.

పాపం ఈ విషయం తెలియక నయన్ ప్రమోషన్స్ కు రావడంలేదని నానా యాగిరి చేశారు సౌత్ మీడియా వారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube