చిన్నపిల్లలో ఈ డిజార్డర్ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడండి

ఆటిజం (Autism), ఈ పేరు అల్రేడి విన్నవారికి ఈ డిజార్డర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా కాని, తెలియని వారికి చెప్పేదేంటంటే, ఇదొక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్.ఈ డిజార్డర్ ఇందుకే వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేకపోతన్నారు పరిశోధకులు.

 Autism – A Disorder Which Parents Should Understand-TeluguStop.com

అయితే జీన్స్ వలన మాత్రమే కాదు బయోలాజికల్ కండీషన్స్ వలన కూడా పిల్లలో ఈ డిజార్డర్ వస్తుందని అధ్యయనాలు తెలిపాయి.

ఈ డిజార్డర్ తో బాధపడే పిల్లలు చిన్ననాటి నుంచి నలుగురితో కలవడానికి ఇష్టపడరు.

ముఖాముఖి మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది వీళ్ళకి.ముఖ కవళికలు కూడా పెద్దగా బయటపడవు.

ఎమోషన్స్ బయటకి చూపించడానికి ఇష్టపడరు.సంతోషం, బాధ, దుఃఖం .ఏదైనా సరే, తమలో తామే అన్నట్లుగా ఉంటారు.బయటి ప్రపంచం అంటే బెరుకు.

ఎవరు వీరికి స్నేహితులు కారు.ఈ లక్షణాలు చాలావరకు మొదటి మూడు సంవత్సరాల వయసులోనే బయటపడతాయి.

ఇలాంటి పిల్లలు ఒక్కోసారి తమని తాము శారీరకంగా గాయపర్చుకునే ప్రమాదం కూడా ఉంటుందట.

ఒంటరితనాన్ని అతిగా కొరుకునే పిల్లలు చాలావరకు ఈ సమస్యతో బాధపడుతుంటారు.

ఇలాంటి లక్షణాలు తమ పిల్లల్లో కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం అవ్వాలి.ఆటిజంతో బాధపడేవారికి స్పెషల్ డాక్టర్లు, బేబి కేర్ సెంటర్లు, ప్రత్యేక స్కూళ్ళు కూడా ఉంటాయి.

సాధారణ పిల్లలతో వీరు మెలగడం కష్టం.అందుకే స్పెషల్ కేర్ తీసుకుంటూ ఆటిజం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి.

అంతే తప్ప, సమస్య తెలుసుకోకుండా, ఇలాంటి పిల్లలపై చికాకు పడటం, కోపంగా మాట్లాడటం చేస్తే .ఈ పిల్లలకి ప్రపంచం అంటే మరింత భయం పుడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube